దివ్యాంగుల అభ్యున్నతికి కృషి
ABN , First Publish Date - 2021-02-07T04:53:32+05:30 IST
దివ్యాంగుల అభ్యున్నతికి కృషి

ఘట్‌కేసర్: దివ్యాగుల అభ్యున్నతికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఏఎ్‌సరావు నగర్ లయన్స్‌క్లబ్ అధ్యక్షుడు జి.రవికుమార్ అన్నారు. లూయిస్ బ్రెయిలీ 212వ జయంతిని పురష్కరించుకొని పోచారం మున్సిపాలిటీలోని రాజీవ్ గృహకల్ప కాలనీ సమీపంలోని దివ్యాంగుల కాలనీలో శనివారం దివ్యాంగులకు దుప్పట్లు, నిత్యావసరాలను పంపిణీ చేశారు. అనంతరం అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌పీఆర్‌ఆర్‌డీ జిల్లా అధ్యక్షుడు మొక్క ఉపేందర్, నరేష్, వరప్రసాద్, రామకృష్ణారావు, మున్నా, లింగమల్లు, నీరజారెడ్డి, మైసయ్య పాల్గొన్నారు.