ఆర్థికాభివృద్ధి సాధించాలి
ABN , First Publish Date - 2021-10-30T04:14:11+05:30 IST
ఆర్థికాభివృద్ధి సాధించాలి

కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంత్రి మల్లారెడ్డి
కీసరరూరల్: ప్రభుత్వపథకాలను సద్వినియోగం చేసుకోవాలని కార్మిక, ఉపాధి కల్పనాశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి పిలుపు నిచ్చారు. శుక్రవారం సువర్ణఫంక్షన్ హాల్‌లో ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 113 చిన్న తరహా యూనిటక్లు సంబంధించిన సామగ్రిని జడ్పీ చైర్మన్ మలిపెద్ది శరత్‌చంద్రారెడ్డి, ఎమ్మెల్యే సుభా్‌షరెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవితో కలిసి మంత్రి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఎస్సీల ఆర్థికాభివృద్ధికి, వ్యాపార, పరిశ్రమల స్థాపనకు పూర్తి రాయితీతో రుణాలు అందజేస్తుందన్నారు. విదేశీవిద్యతో పాటు కులాంతరవివాహాలు చేసుకున్న వారికి చేయూత నందింస్తోందని చెప్పారు. ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న పథకాలను ప్రజలకు వివరించి, లబ్ధిచేకూరేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ వాణిదేవి అన్నారు. మున్సిపల్ చైర్మన్ చంద్రారెడ్డి మాట్లాడుతూ రుణాల మంజూరులో ఎస్సీ కార్పొరేషన్ అధికారులు తీవ్రజాప్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జాన్‌శ్యామ్‌సన్, ఆనంద్, దమ్మాయిగూడ, పోచారం మున్సిపల్ చైర్మన్లు ప్రణీత, కొండల్‌రెడ్డి, జడ్పీటీసీలు పూస వెంకటేష్, శైలజ, అనిత, ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.