పారదర్శకంగా ఉపాధి పనులు చేపట్టాలి

ABN , First Publish Date - 2021-01-21T05:03:15+05:30 IST

పారదర్శకంగా ఉపాధి పనులు చేపట్టాలి

పారదర్శకంగా ఉపాధి పనులు చేపట్టాలి
మొక్కలను పరిశీలిస్తున్న ప్రతీక్‌జైన్‌

  • అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ 

యాచారం : మండలంలోని ప్రతి కూలీకి చేతినిండ పనికల్పించాలి,  పని లేదని కూలీల నుంచి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ అన్నారు. బుధవారం మండల పరిషత్‌ కార్యాలయంలో డీఆర్డీఏ పీడీ ప్రభాకర్‌తో కలిసి ఉపాధి హామీ పనులపై అధికారులతో సమీక్షించారు. ఏయే గ్రామంలో ఎంత మంది కూలీలున్నారు.. చేపట్టాల్సిన పనుల విషయమై అడిగి తెలుసుకున్నారు. ఈ ఏడాది వర్షాలు బాగా కురిశాయని, కూలీలు వస్తారా లేదా అనేది అనుమానంగా ఉందని టెక్నికల్‌ అసిస్టెంట్‌ అదనపు కలెక్టర్‌ దృష్టికి తేగా ముందు పనులు ఆరంభించండి ఆ తరువాత చూద్దామని ఆయన పేర్కొన్నారు.  అనంతరం  మొండిగౌరెల్లిలో నర్సరీలో మరో వెయ్యి మొక్కలను నాటించాలని ఏపీవో లింగయ్యను ఆదేశించారు.  హరితహారం మొక్కలు ఎండిపోకుండా చర్యలు తీసుకోవాలని ఇన్‌చార్జి ఎంపీడీవో శ్రీనివా్‌సను ఆదేశించారు. అనంతరం మాల్‌కు వెళ్లి జిల్లా సరిహద్దును పరిశీలించారు. మాల్‌ నుంచి యాచారం వరకు సాగర్‌ ప్రధాన రహదారి పక్కన హరితహారం మొక్కలను పరిశీలించారు.  మొక్కలకు నీరు ఎందుకు పట్టడం లేదని పంచాయతీ కార్యదర్శులను ప్రశ్నించారు.  సాగర్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారి పక్కన చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలని ఈవోఆర్డీ శ్రీలతను ఆదేశించారు. కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్‌ శివశంకర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌ శాఖ ఏఈ రాంసింగ్‌ఠాకూర్‌ తదితరులున్నారు.  కాగా, జడ్పీ సీఈవో దిలి్‌పకుమార్‌ బుధవారం ఉదయం ఆకసిక్మంగా  యాచారం మండలానికి వచ్చి వెంటనే అబ్దుల్లాపూర్‌మెట్‌కు వెళ్లిపోయారు. అంతకు ముందే అదనపు కలెక్టర్‌ ప్రతీక్‌జైన్‌ వచ్చి అధికారులతో మాట్లాడుతున్నారు.  ఈ విషయం తెలియక వచ్చిన దిలి్‌పకుమార్‌ వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోయారు. 

Updated Date - 2021-01-21T05:03:15+05:30 IST