డ్రైవర్ నిర్లక్ష్యం.. క్లీనర్ మృతి
ABN , First Publish Date - 2021-10-26T04:15:20+05:30 IST
డ్రైవర్ నిర్లక్ష్యం.. క్లీనర్ మృతి

నందిగామ: డ్రైవర్ నిర్లక్ష్యంతో క్లీనర్ మృతి చెందిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం లారీలో వరిపొట్టును నింపుకుని మండల శివారులోని నవదుర్గ టెక్స్‌టైల్ పరిశ్రమకు వెళ్తూ తహసీల్దార్ కార్యలయం సమీపంలో లారీని ఆపి డ్రైవర్, క్లీనర్ విశ్రాంతి తీసుకున్నారు. ఈ క్రమంలో క్లీనర్ యోగేంద్ర భరత్(55) లారీ క్రింద పడుకున్నాడు. డ్రైవర్ గమనించకుండా లారీని తీయడంతో టైర్ల కింద పడి యోగేంద్ర అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి స్వస్థలం బీహార్ రాష్ట్రం. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రామయ్య తెలిపారు.