రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

ABN , First Publish Date - 2021-02-07T05:09:25+05:30 IST

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ మృతి

మాడ్గుల: వరంగల్‌ జిల్లా పరకాల మండలం సాయిపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మాడ్గుల మండలం సుద్దపల్లి గ్రామానికి చెందిన డ్రైవర్‌ గ్యార కృష్ణయ్య మృతి చెందాడు. శుక్రవారం రాత్రి డీసీఎం బోల్తాపడి కృష్ణయ్య మృతి చెందగా శనివారం మృతదేహాన్ని గ్రామానికి తీసుకువచ్చారు. మృతుడి కుటుంబాన్ని సుద్దపల్లి సర్పంచ్‌ యాచారం వెంకటేశ్వర్లుగౌడ్‌ పరామర్శించారు. మృతదేహాన్ని సందర్శించి నివాళులర్పించారు. మృతుడి కుటుంబానికి రూ.5 వేలు అర్థికసాయం, క్వింటాల్‌ బియ్యం అందజేశారు. పరామర్శించిన వారిలో  కృష్ణయ్య, నర్సింహ, వెంకటయ్య, యాదయ్య, వీరయ్య, హరికృష్ణ, తేజ, సాయి, రామకృష్ణ, తదితరులున్నారు.


Updated Date - 2021-02-07T05:09:25+05:30 IST