ఆపద వేళ దాతల సాయం

ABN , First Publish Date - 2021-05-22T05:15:17+05:30 IST

ఆపద వేళ దాతల సాయం

ఆపద వేళ దాతల సాయం
కడ్తాలలో మాస్క్‌లు పంపిణీ చేస్తున్న టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి

ఆమనగల్లు/కడ్తాల్‌/మాడ్గుల/యాచారం : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వం పేదలకు చేయూతనందించి ఆదుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ డాక్టర్‌ మల్లు రవి కోరారు. కడ్తాల, ఆమనగల్లు, తలకొండపల్లి మండల కేంద్రాల్లో శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఉచితంగా మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో డీసీసీ అధికార ప్రతినిధి గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, యువజన కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు రవికాంత్‌గౌడ్‌, జిల్లా కార్యదర్శి కృష్ణనాయక్‌, మండల అధ్యక్షుడు యాట నర్సింహ, తదితరులు పాల్గొన్నారు. ఆమనగల్లు పట్టణంలో శుక్రవారం జీఎ్‌సఆర్‌ యువసేన ఆధ్వర్యంలో విలేకరులకు మాస్క్‌లు, శానిటైజర్లు అందజేశారు. టీఆర్‌ఎస్‌ నాయకుడు గోలి శ్రీనివా్‌సరెడ్డి వాటిని సమకూర్చారు. మాడ్గుల మండలంలోని జరుపుల తండా గ్రామపంచాయితీలోని మక్తతండాకు చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. విషయం తెలుసుకున్న తలకొండపల్లి జడ్పీటీసీ ఉప్పల చారిటబుల్‌ ట్రస్ట్‌ ఆదేశాల మేరకు శుక్రవారం నర్సంపల్లి సర్పంచ్‌ హనుమానాయక్‌ బాధితుడికి కరోనా కిట్టు అందచేశారు. పోలీసులు అందిస్తున్న సేవలు మరువలేనివని ఉప సర్పంచ్‌ల సంఘం నాగర్‌కర్నూల్‌ జిల్లా అధ్యక్షుడు, టీఆర్‌ఎ్‌స్‌ జిల్లా నాయకుడు గుమ్మకొండ రాజు అన్నారు. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకుడు గోలి శ్రీనివాస్‌ రెడ్డి ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి పోలీ్‌సస్టేషన్ల అధికారులకు, సిబ్బందికి ఎనర్జీ డ్రింక్‌లను సమకూర్చగా రాజు అందజేశారు. కాగా యాచారంలో బీజేపీ మండల అధ్యక్షుడు తాండ్ర రవి మొండిగౌరెల్లిలో కరోనా బాధితులకు గుడ్లు, ఆహార సామాగ్రినందించారు.

Updated Date - 2021-05-22T05:15:17+05:30 IST