అంక్షలు అతిక్రమించొద్దు

ABN , First Publish Date - 2021-12-31T04:08:23+05:30 IST

అంక్షలు అతిక్రమించొద్దు

అంక్షలు అతిక్రమించొద్దు

  • న్యూఇయర్‌ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి 
  • ఎస్పీ  కోటిరెడ్డి

వికారాబాద్‌ : కరోనా నేపథ్యంలో జిల్లాలో  న్యూ ఇయర్‌ వేడుకల సందర్భంగా పలు ఆంక్షలు విధిస్తున్నట్లు ఎస్పీ ఎన్‌.కోటిరెడ్డి సూచించారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఒమైక్రాన్‌ కేసులు నమోదు అవుతున్నాయని, జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉంటూ, జాగ్త్రతల నడుమ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు వేడుకలను ప్రజలు ఇళ్లలోనే నిర్వహించుకో వాలన్నారు. డీజేలకు అనుమతి లేదన్నారు. రిసార్స్ట్‌, ఫామ్‌హౌ్‌సలపై ప్రత్యేక నిఘా ఉంటుందని, ఎలాంటి అశ్లీల కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. మద్యంసేవించి ర్యాష్‌డ్రైవింగ్‌, ట్రిపుల్‌ డ్రైవింగ్‌, నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడిపితే చర్యలు తప్పవన్నారు.  డిసెంబర్‌ 31 అర్ధరాత్రి ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని, జనవరి 2వరకు బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిషేధమన్నారు. ఎవరైనా  నిబంధనలు అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. డిసెంబర్‌ 31వ తేదీ సాయంత్రం 5 గంటల నుంచి 3 చెక్‌పోస్టులు, 4 పోలీస్‌ పికెట్లు, 2 పెట్రోలింగ్‌ వాహనాలు ఏర్పాటు చేయడం జరుగుతుందని, జిల్లా వ్యాప్తంగా 40 చోట్ల డ్రంకెన్‌డ్రైవ్‌ నిర్వహించనున్నట్లు వివరించారు. ప్రతిఒక్కరూ మాస్కు ధరించి, భౌతికదూరం పాటిస్తూ వేడుకలు జరుపుకోవాలన్నారు. ఈసందర్భంగా జిల్లా ప్రజలందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. 

Updated Date - 2021-12-31T04:08:23+05:30 IST