ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దు

ABN , First Publish Date - 2021-05-03T04:37:07+05:30 IST

ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దు

ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దు
సమావేశంలో మాట్లాడుతున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

బంట్వారం: కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ప్రజలను గందరగోళానికి గురిచేయొద్దని మర్పల్లి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ దుర్గంచెరువు మల్లేషం, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డిలు అన్నారు. ఆదివారం మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెద్దేముల్‌ మండలంలోని 11పంచాయతీలను నూతన మండలంగా ఏర్పాటు చేయాలని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రికి విన్నవించారని తెలిపారు. బంట్వారం మండలానికి చెందిన ఒక్కగ్రామాన్ని కూడా తట్టేపల్లి మండలంలో కలిపేది లేదని స్పష్టం చేశారు. బంట్వారం మండలంలోని అన్ని గ్రామాలు అలాగే ఉంటాయని వికారాబాద్‌ ఎమ్మెల్యే ఆనంద్‌ హామీ ఇచ్చారని వారు తెలిపారు. కానీ కొంతమంది కాంగ్రెస్‌ పార్టీ నాయకులు బంట్వారం మండలం ఉనికి కోల్పోతుందని చెప్పడం సమంజసం కాదని వారు ఆరోపించారు. ఇక 108 వాహనాన్ని ఎక్కడ అవసరముంటే అక్కడి ప్రజల అత్యవసర పరిస్థితుల నిమిత్తం వినియోగించుకుంటున్నారని తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే ఆనంద్‌ ఉన్నతాధికారులతో మాట్లాడి వాహనాన్ని మండల కేంద్రంలోనే కొనసాగిస్తామని వారు హామీ ఇచ్చారు. ప్రజలను అనవసరంగా గందరగోళానికి గురిచేయొద్దని విజ్ఞప్తి చేశారు. మాజీ ఎంపీపీ రాములుయాదవ్‌, నాయకులు శ్రీనివాస్‌, ఖాజాపాషా, వెంకటేషం, లక్ష్మయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-03T04:37:07+05:30 IST