వివాదాస్పద స్థలంలోనిర్మాణాలను నిలిపివేసిన డీఎల్పీవో

ABN , First Publish Date - 2021-05-18T05:39:14+05:30 IST

వివాదాస్పద స్థలంలోనిర్మాణాలను నిలిపివేసిన డీఎల్పీవో

వివాదాస్పద స్థలంలోనిర్మాణాలను నిలిపివేసిన డీఎల్పీవో
వివాదాస్పదస్థలాన్ని పరిశీలిస్తున్న డీఎల్పీవో అన్నపూర్ణ

శంషాబాద్‌ రూరల్‌: చౌదరిగూడ పంచాయతీ పరిధి వివాదాస్పద స్థల ంలో చేపడుతున్న నిర్మాణాలను సోమవారం డీఎల్పీవో అన్నపూర్ణ, మండలపంచాయతీ అధికారి డి.సురేందర్‌రెడ్డి నిలిపివేశారు. ఉపసర్పంచ్‌ కళమ్మ, ఎం.మ హేష్‌, పరిపూర్ణమహేష్‌, మామిళ్ల మల్లేష్‌, మునుగా ళ్లు సంజీవ, మరి కొంత మంది గ్రామస్థులు చేసిన ఫిర్యాదుతో పాటు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా వివాదాస్పద స్థలం వద్దకు వెళ్లి విచారణ చేసి పరిశీలించామని అధికారులు తెలిపారు. అక్రమ నిర్మాణాలు చేపట్టిన వారికి నోటీసులు జారీ చేయాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించామన్నారు. ఈ భూమి గ్రామ కంఠమా? ప్రభుత్వ భూమా? లేక పట్టాదా? అనేది రెవెన్యూ అధికారులతో సర్వే చేయించి నిర్ధారించి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా డీఎల్పీవో చెప్పారు. అక్రమ నిర్మాణాలు ఎవరు చేపట్టినా, వారికి ప్రోత్సహిం చినా చర్యలు తీసుకుంటామని డీఎల్పీవో హెచ్చరించారు. వివాదాస్పద భూమిలో నిర్మాణాలు చేపట్టవద్దని ఈ సందర్భంగా సూచించామని తెలిపారు. అధికారుల వెంట పంచాయతీ కార్యదర్శి, గ్రామస్థులు ఉన్నారు.

Updated Date - 2021-05-18T05:39:14+05:30 IST