దౌల్తాబాద్‌లో జిల్లా అడిషనల్ కలెక్టర్ పర్యటన
ABN , First Publish Date - 2021-01-20T06:16:01+05:30 IST
దౌల్తాబాద్‌లో జిల్లా అడిషనల్ కలెక్టర్ పర్యటన

దౌల్తాబాద్: మండలంలోని నీటూర్, చంద్రకల్, కుప్పగిరి, చల్లాపూర్, పొల్కంపల్లి గ్రామాల్లో జిల్లా అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య మంగళవారం పర్యటించారు. పొల్కంపల్లి గ్రామంలో కంపోస్టు షెడ్, క్రిమిటోరియం పనులను ఆయన పరిశీలించారు. పంచాయతీ కార్యదర్శులు విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.