సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

ABN , First Publish Date - 2021-05-18T05:53:07+05:30 IST

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ

సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కుల పంపిణీ
చెక్కు అందజేస్తున్న జైపాల్‌యాదవ్‌

ఆమనగల్లు/ షాద్‌నగర్‌:  మున్సిపాలటీలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన జె.లింగప్ప హైదరాబాద్‌లోని ప్రైవేట్‌ ఆసుపత్రిలో చికిత్స పొందాడు. తనను ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ను కోరారు. సోమవారం ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిధి కిద రూ.50వేల చెక్కును లింగప్పకు అందజేశారు. ఎంపీటీసీ దోనాదుల కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు నారాయణ, గిరియాదవ్‌, సయ్యద్‌ ఖలీల్‌, బాలకృష్ణ, నరేందర్‌, కృష్ణ పాల్గొన్నారు. షాద్‌నగర్‌లో మన్సిపల్‌ మాజీ చైర్మన్‌ అగ్గనూరి విశ్వం, కౌన్సిలర్‌ విశాల సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కులను అందజేశారు.23వ వార్డుకు చెందిన గట్టు జయమ్మకు రూ.34వేల చెక్కు మంజూరుకాగా వారు అందజేశారు. ఈ కార్యక్రమంలో నందు, కైలాస్‌నాథ్‌, కిట్టు, ఖాజామొయినొద్దీన్‌, సందీప్‌, శ్రీకాంత్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-05-18T05:53:07+05:30 IST