బతుకమ్మ చీరల పంపిణీ

ABN , First Publish Date - 2021-10-08T05:00:22+05:30 IST

బతుకమ్మ చీరల పంపిణీ

బతుకమ్మ చీరల పంపిణీ
సుభాన్‌పూర్‌లో చీరలు పంపిణీ చేస్తున్న చైర్‌పర్సన్‌ అనితారెడ్డి

నందిగామ/కడ్తాల్‌/మాడ్గుల/మహేశ్వరం/చేవెళ్ల/కందుకూరు: బతుకమ్మ చీరలు పంపిణీ కార్యక్రమాన్ని గురువారం నందిగామ మండలం అప్పారెడ్డిగూడలో ప్రజాప్రతినిధులు, నాయకులు నిర్వహించారు. జడ్పీవై్‌సచైర్మన్‌ ఈట గణేష్‌, సర్పంచ్‌ జెకె.నర్సింలు, ఎంపీటీసీ కాట్న లతశ్రీశైలం, పీఏసీఎస్‌ చైర్మన్‌ అశోక్‌, ఎంపీడీవో బాల్‌రెడ్డి, లింగం, నర్సింలు, క్రిష్ణ, కుమార్‌ పాల్గొన్నారు. కడ్తాలలో బ తుకమ్మ చీరల పంపిణీకి ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ హాజరయ్యారు. ఆడ బిడ్డల ఆనందమే కేసీఆర్‌ ధ్యేయం అన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మీనర్సింహారెడ్డి, తహసీల్దార్‌ మహేందర్‌రెడ్డి, ఎంపీడీవో రామకృష్ణ, ఎంపీవో తేజ్‌సింగ్‌, ఎంపీటీసీ గూడూరు శ్రీనివా్‌సరెడ్డి, ఉపసర్పంచ్‌ రామకృష్ణ, బిక్షపతి, మహేశ్‌, భాస్కర్‌రెడ్డి, దీపయాదగిరిరెడ్డి, చందోజి, నర్సింహ, రామచందర్‌, రామచంద్రయ్య, రమేశ్‌, వెంకటేశ్‌, వాణిశ్రీ, వనిత, లావణ్య, శైలజ, పంచాయతీ కార్యదర్శి రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. ఎక్వాయిపల్లి చీరల పంపిణీకి జాతీయ బీసీ కమిషన్‌ సభ్యుడు తల్లోజు ఆచారి హాజరయ్యారు. సర్పంచ్‌ జంగం సుగుణసాయిలు, ఎంపీటీసీ ఉమావతి బుగ్గయ్యగౌడ్‌, వెంకటేశ్‌, సింహాద్రి, మోహిన్‌, సాయిలాల్‌ పాల్గొన్నారు. మాడ్గులలో బతుకమ్మ చీరల పంపిణీలో ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌ పాల్గొన్నారు. అనంతరం ఐదుగురికి సీఎం రీలీఫ్‌ ఫండ్‌ చెక్కులను అందచేశారు. సర్పంచ్‌ అంబల్ల జంగయ్యగౌడ్‌, ఎంపీటీసీ ఏమిరెడ్డి జైపాల్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ రవి, మాజీ ఎంపీపీ జైపాల్‌నాయక్‌, నాయకులు లాలయ్యగౌడ్‌, పవన్‌కుమార్‌రెడ్డి పాల్గొన్నారు. మహేశ్వరం మండలం సుభాన్‌పూర్‌లో గురువారం జడ్పీ చైర్‌పర్సన్‌ డాక్టర్‌ తీగలఅనితారెడ్డి బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. అనంతరం మం డల పరిషత్‌లో మండల స్థాయి అధికారులతో పలు అభివృద్ధి పనులపై సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.రఘుమారెడ్డి, ఆర్‌.సునీత అంద్యానాయక్‌, నర్సింహులు, పద్మపాండు పాల్గొన్నారు. చేవెళ్ల మండలంలోని మల్లారెడ్డిగూడలో  సర్పంచ్‌ ఎం.మోహన్‌రెడ్డి చీరలను పంపిణీ చేశారు. ఉపసర్పంచ్‌ రాధిక, నాయకులు వెంకటేశ్‌ పాల్గొన్నారు. కందుకూరు మండలంలోని దెబ్బడగూడలో ఎంపీపీ మంద జ్యోతి, జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి మహిళలకు బతుకమ్మ చీరలను పంపిణీ చేశారు. డి.చంద్రశేఖర్‌, ఎండీ.సులేమాన్‌, ఎల్మటి లక్ష్మి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-08T05:00:22+05:30 IST