అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి

ABN , First Publish Date - 2021-11-09T06:12:52+05:30 IST

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి

అభివృద్ధి పనులను సకాలంలో పూర్తిచేయాలి

వికారాబాద్‌, నవంబరు 8 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో గత రెండేళ్లలో మంజూరైన అభివృద్ధి పనులను నిర్ధిష్ట కాల వ్యవధిలో పూర్తిచేయాలని జడ్పీ చైర్‌పర్సన్‌ పట్నం సునీతారెడ్డి అధికారులను ఆదేశించారు. జడ్పీ నిధులతో చేపట్టిన పనుల పురోగతిపై సోమవారం ఆమె తన కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. 2019 నుంచి ఇప్పటివరకు మంజూరైన పీఆర్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ నిధులతో చేపట్టిన పనులను నిర్ధేశించిన సమయంలోగా పూర్తిచేయాలని ఆమె స్పష్టం చేశారు. కాల వ్యవధి ముగిసిన పనులను గతంలోనే రద్దు చేశామని, ఇంకా ప్రారంభించని పనులు ఉంటే వాటిని కూడా రద్దు చేస్తామన్నారు. గ్రామాల్లో కొనసాగుతున్న పనులను ఇంజనీరింగ్‌ అధికారులు దగ్గరుండి పర్యవేక్షించాలని సూచించారు. సమావేశంలో సీఈవో జానకీరెడ్డి, డిప్యూటీ సీఈవో సుభాషిణి, పీఆర్‌ఈఈ శ్రీనివా్‌సరెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఈఈ శ్రీనివాస్‌, డిప్యూటీ ఈఈలు పాల్గొన్నారు. 

Updated Date - 2021-11-09T06:12:52+05:30 IST