టీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి

ABN , First Publish Date - 2021-12-16T05:07:48+05:30 IST

టీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి

టీఆర్‌ఎస్‌ పాలనలోనే అభివృద్ధి
పొల్కంపల్లిలో వైకుంఠధామాన్ని ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి తదితరులు

ఇబ్రహీంపట్నం రూరల్‌: టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే గ్రామాలు అభివృద్ధి చెందాయని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. బుధవారం పొల్కంపల్లిలో వైకుంఠధామం, పల్లెప్రకృతి వనం, డంప్‌యార్డు, మాన్యగూడలో సీసీ రోడ్డును, నాగన్‌పల్లిలో రామోజీ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రూ.కోటితో నిర్మించిన పంచాయతీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. తెలంగాణ రాష్ట్రం వచ్చాక కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తున్నారని అన్నారు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామానికి నిధులు కేటాయిస్తున్నామని తెలిపారు. నాగన్‌పల్లి గ్రామాన్ని రామోజీ ఫౌండేషన్‌ దత్తత తీసుకొని అభివృద్ది చేస్తున్నందుకు తనకు సంతోషంగా ఉందన్నారు. అనంతరం  అనారోగ్యం పాలైన కోఆప్షన్‌ సభ్యుడు షరీఫ్‌ ఇంటికి వెళ్లి పరామర్శించారు. కార్యక్రమంలో రామోజీ ఫిలింసిటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ విజయేశ్వరి, డైరెక్టర్‌ శివరామకృష్ణ, ఎంపీపీ కృపేష్‌, జడ్పీటీసీ మహిపాల్‌, వైస్‌ఎంపీపీ మంచిరెడ్డి ప్రతా్‌పరెడ్డి, సర్పంచ్‌లు జగన్‌, చెరుకూరి ఆండాలుగిరి, ఉపసర్పంచ్‌లు జంగారెడ్డి, బీరప్ప, ఎంపీటీసీ చెరుకూరి మంగరవీందర్‌, సొసైటీ చైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బుగ్గరాములు, కార్యదర్శి భాస్కర్‌రెడ్డి, నర్సింగ్‌, దానయ్యగౌడ్‌, వార్డుసభ్యులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-16T05:07:48+05:30 IST