శిథిలావస్థలో వ్యవసాయ శాఖ గోదాం

ABN , First Publish Date - 2021-12-10T04:20:16+05:30 IST

ఆమనగల్లు మండల పరిషత్‌ కార్యాలయ

శిథిలావస్థలో వ్యవసాయ శాఖ గోదాం

ఆమనగల్లు : ఆమనగల్లు మండల పరిషత్‌ కార్యాలయ ఆవరణలో ఉన్న వ్యవసాయ శాఖ గోదాం శిథిలావస్థకు చేరుకుంది. ఐదు దశాబ్దాల క్రితం వ్యవ సాయ శాఖ ఆధ్వర్యంలో గోదాంను నిర్మించారు. కాగా ఏళ్లకాలంగా గోదాంను వినియోగిం చక, నిర్వహణ కరువై నిరూపయోగంగా మారింది. క్రమంగా రేకులు, గోడలు దెబ్బతిని కూలిపోయే దశకు చేరుకుంది. స్వల్ప మరమ్మతులు చేస్తే గోదాం వినియోగంలోకి వస్తుంది. సింగిల్‌విండోకు కూడా అనువైన గోదాం లేదు. దీన్ని మరమ్మతు చేస్తే రైతులకు అనుకూలంగా ఉంటుంది. ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. 


Updated Date - 2021-12-10T04:20:16+05:30 IST