ప్రమాదవశాత్తు నిప్పంటుకొని డీసీఎం దగ్దం
ABN , First Publish Date - 2021-01-21T04:41:50+05:30 IST
ప్రమాదవశాత్తు నిప్పంటుకొని డీసీఎం దగ్దం

నవాబుపేట : ప్రమాదవశాత్తు నిప్పంటుకొని ఓ డీసీఎం దగ్ధమైన సంఘటన నవాబుపేట మండలంలో చోటుచేసుకుంది. వికారాబాద్ నుంచి పటాన్‌చెరు వైపు ఖాళీ కాట న్ బాక్సుల (అట్టల) లోడుతో వెళ్తున్న డీసీఎం (ఏపీ 12యూ 5166) ఎల్లకొండ-మాదిరెడ్డిపల్లి గ్రామాల గేటు సమీపానికి రాగానే ఒక్కసారిగా కార్టన్ బాక్సులకు నిప్పంటుకుంది. దీంతో వెంటనే స్థానికులు స్థానిక సర్పంచ్ రావుగారి వెంకట్‌రెడ్డికి, ఫైర్‌సిబ్బంది, పోలీసులకు సమాచారమిచ్చారు. సర్పంచ్ పంచాయతీ ట్యాంకర్‌ను పంపగా, ఫైర్ సిబ్బంది కూడా వచ్చి మంటలను ఆర్పారు. రోడ్డు పక్కన గుర్తు తెలియని వ్యక్తులు గడ్డిని కాలుస్తుండగా నిప్పురవ్వలు పడి అట్టల లోడు కాలిపోయినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్‌కు ఎలాంటి ప్రమాదం జరగలేదని ఎస్‌ఐ వెంకటేషం తెలిపారు. కాగా ఈ సంఘటనలో రూ.లక్ష ఆస్తినష్టం వాటిల్లిందని డీసీఎం యజమాని మక్బూల్ హుస్సేన్ తెలిపారు.