భూకైలాస్ ప్రధానార్చకుడి కన్నుమూత
ABN , First Publish Date - 2021-02-14T04:32:01+05:30 IST
భూకైలాస్ ప్రధానార్చకుడి కన్నుమూత
తాండూరు రూరల్ : తాండూరు మండలం అంతారం తండా సమీపంలోని భూకైలాస్ ఆలయ ప్రధాన అర్చకుడు అల్లమా ప్రభు శనివారం తెల్లవారుజామున అనారోగ్యంతో కన్నుమూశారు. మూడు రోజుల క్రితం అస్వస్థతకు గురైన ఆయన కుల్కచర్లలో ఉండే తన కూతురి వద్దకు వెళ్లాడు. అక్కడే చికిత్సలు పొందినా ఆరోగ్యం మెరుగు పడలేదు. దీంతో శనివారం తెల్లవారుజామున కూతురి ఇంట్లోనే మృతి చెందారు. ఆయన కుమారులు మృతదేహాన్ని ఆయన స్వగ్రామమైన వికారాబాద్‌కు తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. అల్లమాప్రభు ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉద్యోగ విరమణ పొంది శ్రీశైలం మఠం పూజారిగా, తాండూరులోని భద్రేశ్వరస్వామి ఆలయంలో పూజారిగా కూడా పనిచేశారు. భూకైలాస్ ప్రధానార్చకుడిగా పనిచేశారు. ఆయన అంత్యక్రియల్లో భూకైలాస్ వ్యవస్థాపకుడు వాసుపవార్‌నాయక్ కుటుంబీకులతో పాల్గొన్నారు.