అధికారం కోసం అడ్డదారులు

ABN , First Publish Date - 2021-11-24T05:09:33+05:30 IST

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డదారులు

అధికారం కోసం అడ్డదారులు
కలెక్టరేట్‌ వద్ద లాఠీచార్జి చేసి ఆందోళనకారులను చెదరగొడుతున్న పోలీసులు

  • జిల్లాలో టీఆర్‌ఎస్‌ కొత్త సంస్కృతి 
  • ఇండిపెండెంట్లు నామినేషన్లు వేయకుండా అడ్డగింత
  • అడుగడుగునా అవాంతరాలు 
  • నామినేషను ఫారాలు చింపివేత
  • రెండువర్గాల మధ్య ఘర్షణ.. పోలీసుల లాఠీచార్జి 
  • రణరంగంగా మారిన రంగారెడ్డి కలెక్టరేట్‌


రంగారెడ్డి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ అడ్డదారులు తొక్కింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇండిపెండెంట్లు నామినేషన్లు వేయకుండా అడుగడుగునా అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ దశలో పోలీసులు విపక్ష నేతలపై లాఠీ చార్జి చేయడంతో కలెక్టరేట్‌ రణ రంగంగా మారింది. రంగారెడ్డి జిల్లాలోని ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్లు వేసేందుకు మం గళవారం చివరిరోజు. దీంతో ఇతరులెవరూ నామినేషన్‌ వేయ కుండా అధికార పార్టీ నేతలు ముందుగానే ప్లాన్‌ చేసుకున్నారు. ఆ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలతో పాటు టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పట్నం మహేందర్‌ రెడ్డి పీఏ గేటువద్దే నిచ్చున్నారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులు లోపలకు వెళ్లకుండా అక్కడే అడ్డుకొని వారిపై దౌర్జన్యం చేశారు. వారి నామినేషన్‌ పత్రా లను చింపి పడేశారు.


ఇంత జరుగుతున్నా అక్కడ పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు. ఇండిపెండెం ట్లను అడ్డుకోవడంలో వారు కూడా పాలుపంచుకు న్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా చరిత్రలో ఇలాంటి పరిణామాలు జరగడం ఇదే తొలిసారి. అధికార పార్టీ నేతలు, కార్యకర్తలు కలెక్టరేట్‌ను దిగ్బంధించి ఎన్నికలు ఏకగ్రీవం చేసుకునేందుకు అనేక ఉల్లం ఘనలకు పాల్పడ్డారు. పంచాయతీరాజ్‌ సంఘం తరఫున నామినేషన్లు వేసేందుకు వచ్చిన వారిని అడుగడుగునా అడ్డుకున్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు హైడ్రామా కొనసా గింది. ఇండిపెండెంట్‌ అభ్యర్థిగా చింపుల శైలజారెడ్డి నామినేషన్‌ దాఖలు చేయకుండా అడ్డుకున్నారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, కార్యకర్తలు నామి నేషన్‌ పత్రాలను చించేశారు. చివరకు నామినేషన్‌ వేయకుండా చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తల.. ఎంపీటీసీ సంఘం నాయ కుల మధ్య ఘర్షణ నెలకొంది. తోపులాట జరి గింది. బారికేడ్లు తోసుకొని వచ్చే ప్రయత్నంలో ఉద్రిక్తతకు దారి తీసింది. నామినేషన్‌ ప్రకియ ముగిసే వరకు పోలీసులు మూడుసార్లు లాఠీచార్జి చేశారు.


ఉదయం 11 గం టలకు టీఆర్‌ఎస్‌ అభ్య ర్థులు పట్నం మహేం దర్‌రెడ్డి మూడుసెట్లు, శంభీపూర్‌ రాజు రెండు సెట్లు నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అమయ్‌కుమార్‌కు అంద జేశారు. ఇదే సమయంలో నామినేషన్‌ వేసేందుకు వచ్చిన ఇండిపెండెంట్‌ అభ్యర్థి చింపుల శైలజారెడ్డిని గేటు బయటే టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. ఆమె చేతిలో నుంచి నామినేషన్‌ పత్రాలను లాక్కొని చించేశారు. ఈ సమయంలో అభ్యర్థి కుమారుడు అశ్విన్‌రెడ్డి అడ్డుకునే ప్రయత్నం చేయగా అతనిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేం దర్‌రెడ్డి అనుచరుడు సదీర్‌రెడ్డి చేయి చేసుకు న్నారు. పోలీసుల తీరును ఖండిస్తూ శైలజారెడ్డి కింద కూర్చొని నిరసన తెలిపారు. మాకు న్యాయం కావాలంటూ రోడ్డుపై ఎంపీటీసీలు బైఠాయించారు. మధ్యాహ్నం 2గంటల తర్వాత ఆమెను లోపలికి అనుమతించారు. కలెక్టర్‌ వద్దకు వెళ్లిన ఆమె బయట జరిగిన తీరును వివరించారు. మళ్లీ నామి నేషన్‌ పత్రాలను తీసుకుని బల పరిచే ఎంపీటీసీలతో కలెక్టర్‌ వద్దకు వెళుతున్న తరుణంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేందర్‌రెడ్డి అనుచరుడు వచ్చి నామినేషన్‌ పత్రాలను లాక్కొని వెళ్లిపోయాడు. చివరగా నామినేషన్‌ వేసేందుకు ప్రయత్నించినా ప్రతిపాదించే ఎంపీటీసీలను లోపలికి అనుమతించలేదు. దీంతో నామినేషన్‌ వేసే సమయం దాటిపోయింది. 


ముగిసిన నామినేషన్ల ప్రక్రియ

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 16న ప్రారంభమైన నామినేషన్ల ప్రక్రియ 23తో ముగిసింది. చివరిరోజు మంగళవారం టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి సుంకరి రాజు (శంభీపూర్‌రాజు) నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి అమయ్‌కుమార్‌కు దాఖలు చేశారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థి చలిక చంద్రశేఖర్‌ ఒక౅ సట్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ కార్యక్ర మంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి, ఎమ్మెల్యేలు వివేక్‌, అరికెపూడి గాంధీ, జడ్పీ చైర్‌పర్సన్‌ అనితారెడ్డి పాల్గొన్నారు. 


కలెక్టరేట్‌లోనే టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు

ఉదయం నామినేషన్‌ వేసేందుకు వచ్చిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు పట్నం మహేందర్‌రెడ్డి, శంభీపూర్‌ రాజు కలెక్టర్‌ కార్యాలయంలోనే ఉండిపోయారు. కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన కొనసాగుతుండటంతో వారు బయటకు రాలేదు. వారితో పాటు కొడంగల్‌ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య ఉన్నారు. 


కేటీఆర్‌ ఫోన్‌ చేశారు

నాకు స్వయంగా కేటీఆర్‌ ఫోన్‌ చేశారు. ఎన్నికల్లో పోటీ చేయొద్దని కోరారు. స్థానిక సంస్థలకు రావాల్సిన సినరేజీ నిధులు రూ.540 కోట్లు ఇవ్వాలని కేటీఆర్‌ను కోరాను. ఉదయం టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేందర్‌రెడ్డి అనుచరుడు నా ఇంటికి వచ్చాడు. నామినేషన్‌ వేయవద్దన్నాడు. డబ్బులు ఎరచూపాడు. నేను కాదన్నాను. దీంతో ప్లాన్‌ వేసుకుని నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నం దుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తాం. మాకు తప్పక న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉంది. రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్‌ అమయ్‌కుమార్‌, పోలీసు అధికారులపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తా. 

చింపుల సత్యనారాయణరెడ్డి, పంచాయతీరాజ్‌ ఛాంబర్‌ అధ్యక్షుడు


దమ్ముంటే ఎలక్షన్‌లో ఎదుర్కోవాలి

దమ్ముంటే ఎన్నికల్లో నిలబడి ఎదుర్కోవాలి. కానీ.. రౌడీలను, గూండాలను పెట్టి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్‌ వేయకుండా అడ్డుకున్నారు. నామినేషన్‌ పత్రాలను చించేశారు. మళ్లీ నామినేషన్‌ పత్రాలను నింపి కలెక్టర్‌కు ఇచ్చే సమయంలో దౌర్జన్యంగా లాక్కున్నారు. నామినేషన్‌ వేస్తే.. గెలుస్తామనే భయంతోనే ఇలా చేయించారు. పోలీసులు అధికార పార్టీ అభ్యర్థులకు వత్తాసు పలికారు.

 ఇండిపెండెంట్‌ అభ్యర్థి చింపుల శైలజారెడ్డి 


నా కొడుకును ఎందుకు కొట్టావ్‌.. సదీర్‌రెడ్డిని నిలదీసిన సత్యనారాయణరెడ్డి

నా కొడుకును ఎందుకు కొట్టావని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహేందర్‌రెడ్డి అనుచరుడు సదీర్‌రెడ్డిని చింపుల సత్యనారాయణరెడ్డి నిలదీశారు. నేను కొట్టలేదని సదీర్‌రెడ్డి వాదించాడు. ఇద్దరికి వాగ్వాదం కొనసాగుతున్న సమయంలో టీఆర్‌ఎస్‌ నాయకులు వచ్చి సుధీర్‌రెడ్డిని తీసుకెళ్లారు. 


ఎమ్మెల్యే వివేక్‌తో...

అన్న ఏందే ఇది.. ఇంత దౌర్జన్యమా? ఓ మహిళా అభ్యర్థి నామినేషన్‌ వేయకుండా అడ్డుకోవడమా అంటూ ఎమ్మేల్యే వివేక్‌తో చింపుల సత్యనారాయణరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పక్కనే ఉన్న షాబాద్‌ జడ్పీటీసీ అవినాష్‌రెడ్డి అన్న బయట ఉన్నోళ్లు మా వాళ్లు కాదు.. మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పాడు. 


ప్రజాస్వామ్యం ఖూనీ.. నర్సింహారెడ్డి, బీజేపీ జిల్లా అధ్యక్షుడు 

స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్‌ చివరి రోజున జిల్లా కలె క్టరేట్‌ ఎదుట అధికార పార్టీ నేతలు వ్యవహ రించిన తీరుపై బీజేపీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి మండి పడ్డారు. ఇండిపెండెంట్‌ అభ్యర్థులను నామి నేషన్‌ వేయనివ్వకుండా అడ్డుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. నామినేషన్‌ వేసేం దుకు వచ్చిన ఇండిపెండెంట్‌ అభ్యర్థులను భయాందోళనకు గురిచేయడం మంచిది కాదన్నారు. అధికార పార్టీ అరాచకాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు ఫోటోలు తీస్తున్న జర్నలిస్టుపై చేయి చేసుకోవడం సిగ్గుచేటన్నారు. పోలీసులు ప్రేక్షక పాత్ర వహించడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఖూని చేయడం మంచిది కాదన్నారు. 

Updated Date - 2021-11-24T05:09:33+05:30 IST