ఆటపాటలతో పండుగను నిర్వహించుకోవాలి

ABN , First Publish Date - 2021-01-14T04:26:51+05:30 IST

ఆటపాటలతో పండుగను నిర్వహించుకోవాలి

ఆటపాటలతో పండుగను నిర్వహించుకోవాలి
కొత్తూర్‌: క్రికెట్‌ టోర్నీని ప్రారంభిస్తున్న ఎంపీపీ మధుసూదన్‌రెడ్డి

  • సంక్రాంతిని పురస్కరించుకుని క్రీడా, ముగ్గుల పోటీల నిర్వహణ
  • విజేతలకు బహుమతులు అందజేత

కడ్తాల్‌/తలకొండపల్లి/యాచారం/ఇబ్రహీంపట్నం రూరల్‌ : గ్రామీణ ప్రాంత యువత, విద్యార్థులు క్రీడల్లో రాణించాలని కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు యాట నర్సింహ అన్నారు. కడ్తాల మండలం మక్తమాదారం గ్రామంలో మండల స్థాయి క్రికెట్‌ టోర్నమెంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. క్రీడాకారులకు రూ.5 వేలు విలువ  చేసే క్రికెట్‌ కిట్‌ను అందజేశారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బండి మంజుల చంద్రమౌళి, నాయకులు నింగ్యారి యాదగిరి, మహేందర్‌, చెన్నయ్య, కృష్ణ, తదితరులు పాల్గొన్నారు. తలకొండపల్లి మండల పరిధిలోని చంద్రధన గ్రామంలో సంక్రాంతి ఉత్సవాల్లో భాగంగా యువజన సంఘాల ఆధ్వర్యంలో కబడ్డీ పోటీలను నిర్వహించారు. సర్పంచ్‌, బీజేపీ మండల అధ్యక్షుడు బక్కి కుమార్‌, ఎంపీటీసీ బండెల సుధాకర్‌రెడ్డి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో నాయకులు రాజేందర్‌ రెడ్డి, రఘువర్ధన్‌రెడ్డి, వెంకటేశ్‌, మధుసూదన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. క్రీడలు యువతలో ఐక్యమత్యాన్ని పెంపొందిస్తాయని యాచారం ఎస్‌ఐ ప్రభాకర్‌ అన్నారు. బుధవారం మండల పరిధి ధర్మన్నగూడ గ్రామంలో ఎస్‌ఎ్‌ఫఐ, డీవైఎ్‌ఫఐ ఆధ్వర్యంలో క్రికెట్‌ పోటీలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. యు వత చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భాషయ్య, ఉప సర్పంచ్‌ పాండుచారి, ఎస్‌ఎ్‌ఫఐ జిల్లా ఉపాధ్యక్షుడు ఆలంపల్లి జంగయ్య, డీవైఎ్‌ఫఐ నాయకులు శ్రీశైలం, ఎం.శ్రీమన్నారాయణ, కోఆప్షన్‌ సభ్యులు రాములు, వార్డు సభ్యులు ఇందిరమ్మ, సత్యం,  దేవేందర్‌, రమేష్‌, ఎం.జంగయ్య, యాదగిరి, రమేష్‌, అరుణ్‌కుమార్‌, కె.రమేష్‌, జగన్‌ పాల్గొన్నారు. మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడతాయని ఇబ్రహీంపట్నం మండల పరిధి ఎన్గల్‌గూడ ఎంపీటీసీ మంగ రవీందర్‌,  పోల్కంపల్లి సహకార సంఘం చైర్మన్‌ రాజశేఖర్‌రెడ్డి అన్నారు. బుధవారం పోల్కంపల్లిలో క్రికెట్‌ పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ కె.జంగారెడ్డి,  వార్డు సభ్యులు లింగస్వామి, జంగారెడ్డి పాల్గొన్నారు. 


క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి

కందుకూరు: సంక్రాంతి పండగను ప్రతీ ఒక్కరు ఆటపాటలతో సంబరంగా నిర్వహించుకోవాలని గుమ్మడవెళ్లి సర్పంచ్‌ గౌర ప్రభాకర్‌ కోరారు. పండుగను పురస్కరించుకొని మహిళలకు ముగ్గుల పోటీలు, యువకులకు క్రికెట్‌ టోర్నీని బుధవారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ క్రీడల్లో యువతీ, యువకులు ఉత్సాహంగా పాల్గొనాలన్నారు. కార్యక్రమంలో ఎంపీటీసీ రేఖ, వార్డు సభ్యులు జీవిత, వెంకటే్‌షగౌడ్‌, రాఘవేందర్‌, యాదగిరి. పాండు, విష్ణు, సొసైటీ డైరెక్టర్‌ వెంకటేష్‌ పాల్గొన్నారు. గ్రామీణ క్రీడల పట్ల యువత ఆసక్తి పెంచుకోవాలని కందుకూరు మండలం దాసర్లపల్లి సర్పంచ్‌ పి.బాల మణిఅశోక్‌ అన్నారు. సంక్రాంతిని పురస్కరించుకొని గ్రామంలో నిర్వహించిన వాలీబాల్‌ టోర్నమెంట్‌ను ఎంపీటీసీ టి.ఇందిరదేవేందర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో ఎండీ బుర్హాన్‌, పి.రాజు, ఎడ్ల ప్రవీణ్‌, ఉపసర్పంచ్‌ మంగదేవి, నాయకులు కృష్ణయ్య, యుగేంధర్‌గౌడ్‌, శేఖర్‌, సరితశ్రీశైలం, ఉప్పల వెంకటేష్‌ పాల్గొన్నారు.

ముగ్గుల పోటీలు..

షాబాద్‌: సంక్రాతి పండుగను పురస్కరించుకొని లయన్స్‌ క్లబ్‌, హోఫ్‌ ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో చైర్మన్‌ కొండ విజయ్‌కుమార్‌ బుధవారం షాబాద్‌ బాలుర పాఠశాల ఆవరణలో ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా విజేతలకు బహుమతులు అందజేశారు. ఫౌండేషన్‌ సభ్యులు మల్లికార్జున్‌, నర్సింహులు, ప్రదీప్‌, పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు.


క్రీడలతో స్నేహభావం

కొత్తూర్‌: క్రీడలతో స్నేహభావం పెంపొందుతుందని ఎంపీపీ పి.మధుసూదన్‌రెడ్డి అన్నారు. మల్లాపూర్‌ తండాలో ఎంపీటీఎల్‌ నిర్వాహకుడు మెహన్‌నాయక్‌ ఆధ్వర్యంలో క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీపీ మాట్లాడుతూ క్రీడలతో శరీర దారుఢ్యంతో పాటు మానసికోల్లాసం కలుగుతుం దన్నారు. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ రవినాయక్‌, ఉపసర్పంచ్‌ దశరథ్‌నాయక్‌, దర్శన్‌, చిర్రరాజు, నవీన్‌, నర్సింహారెడ్డి, పాండురంగారెడ్డి, జయేందర్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, సుఽధాకర్‌ పాల్గొన్నారు

Updated Date - 2021-01-14T04:26:51+05:30 IST