సీపీఎం జిల్లా మహాసభలకు తరలిరండి

ABN , First Publish Date - 2021-10-20T04:58:07+05:30 IST

సీపీఎం జిల్లా మహాసభలకు తరలిరండి

సీపీఎం జిల్లా మహాసభలకు తరలిరండి
విలేకరులతో మాట్లాడుతున్న దుబ్బాక రాంచందర్‌

షాద్‌నగర్‌: సీపీఐ(ఎం) జిల్లా మహాసభలను విజయవంతం చేయాలని పార్టీ నాయకులన్నారు. 30, 31 తేదీల్లో షాద్‌నగర్‌లో జరిగే జిల్లా మహాసభలకు 220మంది ప్రతినిఽధులు హాజరవుతారన్నారు. మంగళవారం జిల్లాకార్యదర్శి దుబ్బాక రాంచందర్‌, కోర్‌ కమిటీ సభ్యుడు భాస్కర్‌ షాద్‌నగర్‌ ఆర్‌అండ్‌బీ గెస్ట్‌ హౌస్‌లో విలేకరులతో మాట్లాడు తూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు పెంచి సామాన్యుల పై భారం మోపుతున్నాయన్నారు. షాద్‌నగర్‌, కొత్తూరు,  నందిగామ చుట్టూ పరిశ్రమలున్నా స్థానికులకు ఉద్యోగవకాశాలు కల్పిండచం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-20T04:58:07+05:30 IST