జర్నలిస్టులకు కరోనా టీకా ఇప్పించాలి

ABN , First Publish Date - 2021-03-25T05:05:47+05:30 IST

జర్నలిస్టులకు కరోనా టీకా ఇప్పించాలి

జర్నలిస్టులకు కరోనా టీకా ఇప్పించాలి
డీఎంఅండ్‌హెచ్‌వోకు వినతి పత్రం ఇస్తున్న జర్నలిస్టులు

వికారాబాద్‌: జర్నలిస్టులందరికీ కరోనా టీకా ఇప్పించాలని జిల్లా ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు ఎం.రవీందర్‌ అన్నారు. బుధవారం జర్నలిస్టులు వైద్య ఆరోగ్యశాఖ అధికారి సుధాకర్‌షిండేకు వినతిపత్రం ఇ చ్చారు. రవీందర్‌ మాట్లాడుతూ.. జిల్లాలో 560 మందికి పైగా జర్నలిస్టులు ఉన్నారని అధికారికి తెలిపారు. ఫ్రంట్‌ వారియర్స్‌కు కరోనా టీకా ఇచ్చారని, ప్రాణాలను పణంగా పెట్టి వి ధులు నిర్వహిస్తున్న విలేకర్లలను మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. త్వ రలోనే జర్నలిస్టులందరికీ కొవిడ్‌ వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు కృషిచేస్తామని అధికారి హామీ ఇ చ్చారు. దీర్ఘకాలిక వ్యాఽధలున్న వారు వ్యాక్సిన్‌ తీసుకోకపోవడమే మంచిదన్నారు. ప్రెస్‌ క్లబ్‌ గౌరవాధ్యక్షుడు గిరీశ్వరస్వామి, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ టి.ఆనంద్‌, జిల్లా ప్రధానకార్య దర్శి శ్రీధర్‌, ఉపాధ్యక్షుడు వెంకటరమణ, నరసింహులు, కోశాధికారి టి.గోపాల్‌, జేఎస్‌  సత్యం, మహేష్‌, సభ్యులు వెంకట్‌, గైబులు, ప్రమోద్‌, అశోక్‌, జగదీష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-25T05:05:47+05:30 IST