శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌

ABN , First Publish Date - 2021-10-30T04:29:24+05:30 IST

శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌

శాంతిభద్రతల పరిరక్షణ కోసమే కార్డన్‌సెర్చ్‌
తనిఖీలు చేస్తున్న పోలీసులు

  • ఏసీపీ వేముల భాస్కర్‌  
  • సాతంరాయిలోని రాజీవ్‌గృహకల్పలో నిర్బంధ తనిఖీలు 
  • 16 బైకులు, కారు, ఆటో సీజ్‌


శంషాబాద్‌రూరల్‌: శాంతిభద్రతల కోసమే కార్డన్‌ సెర్చ్‌ నిర్వహించినట్లు ఏసీపీ వేముల భాస్కర్‌ తెలిపారు. గురువారం రాత్రి మున్సిపల్‌ పరిధి సాతంరాయిలో ఆర్జీఐఏ పోలీసులు నిర్బంధ తనిఖీలు చేపట్టారు. సీఐ విజయ్‌కుమార్‌తోపాటు 8 మంది ఎస్సైలు, 64 మంది కానిస్టేబుళ్లు బృందంతో రాజీవ్‌ గృహకల్ప అపార్ట్‌మెంట్‌లో తనిఖీలు నిర్వహించారు. ముగ్గురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పత్రాలు లేని 16బైకులు, కారు, ఆటోను సీజ్‌ చేశారు.  అనంతరం ఏసీపీ భాస్కర్‌ మాట్లాడు తూ రాజీవ్‌ గృహకల్పలో కొందరు మత్తుపదార్థాలకు అలవాటు పడి నేరాలకు పాల్పడుతున్నారనే సమాచారంతో తనిఖీ చేపట్టామన్నారు. 

డ్రగ్‌ రహిత సమాజం కోసం కృషి చేద్దాం

డ్రగ్‌ రహిత సమాజం కోసం కృషి చేద్దామని ఏసీపీ వేముల భాస్కర్‌ పిలుపునిచ్చారు. శుక్రవారం బేగం ఫంక్షన్‌ హాల్‌లో డీసీఏ (డ్రగ్‌ కంట్రోల్‌ అడ్మినిస్ట్రేషన్‌)తో కలిసి మత్తు పదార్ధాల వల్ల కలిగే అనర్థాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యంగా నేటి యువత మత్తు పదార్ధాలకు బానిసలుగా మారుతున్నారని దీంతో బంగారు జీవితాన్ని నాశనం  చేసుకుంటున్నారన్నారు. తల్లిదండ్రులు పిల్లలపై నిరంతరం నిఘా ఉంచాలని సూచించారు. కార్యక్రమంలో సీఐ విజయ్‌కుమార్‌, ఎస్సైలు, మెడికల్‌ యాజమానులు తదిరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:29:24+05:30 IST