పట్టణాభివృద్ధికి సహకరించాలి

ABN , First Publish Date - 2021-10-30T04:31:07+05:30 IST

పట్టణాభివృద్ధికి సహకరించాలి

పట్టణాభివృద్ధికి సహకరించాలి
సీసీ రోడ్డును ప్రారంభిస్తున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

  • షాద్‌నగర్‌ ఎమ్మెల్యే  అంజయ్యయాదవ్‌


షాద్‌నగర్‌అర్బన్‌: షాద్‌నగర్‌ పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌ కోరారు. షాద్‌నగర్‌ మున్సిపాలిటీలోని ఈశ్వర్‌కాలనీ ప్రధాన సీసీ రోడ్డు పనులు, హైమాస్ట్‌ లైట్లను, వెంకటేశ్వర కాలనీలో డైనేజ్‌ పనులను శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈశ్వర్‌కాలనీలో రూ.28లక్షలతో డబుల్‌ లేన్‌ సీసీరోడ్డు నిర్మించామని తెలిపారు. అలాగే పట్టణ కూడళ్లలో రూ.98 లక్షలతో 20 హైమాస్ట్‌ లైట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పాత జాతీయ రహదారి రోడ్ల విస్తరణకు పట్టణంలోని వ్యాపారులు సహకారం అందించాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ కె.నరేందర్‌, వైస్‌ చైర్మన్‌ ఎంఎస్‌ నటరాజ్‌, కౌన్సిలర్లు సలేశ్వర్‌ రాజేశ్వర్‌, టి.ప్రతా్‌పరెడ్డి, జీటీ.శ్రీనివాస్‌, రెటికల్‌ నందీశ్వర్‌, కౌలస్య శంకర్‌, రైతు సమన్వయ కమిటీ మండల అధ్యక్షుడు టి.వెంకట్‌రెడ్డి, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ అగ్గనూరి విశ్వం, ఈశ్వర్‌కాలనీ వాసులు ఎం.వెంకట్‌రెడ్డి, ఎం.పెంటయ్య, ఎల్‌.పెంటయ్య, బి.కృష్ణయ్య, లక్ష్మణ్‌నాయక్‌, శ్రీశైలం, ప్రభులింగం పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-30T04:31:07+05:30 IST