‘కస్తూర్బా’ కష్టాలు

ABN , First Publish Date - 2021-12-09T04:01:29+05:30 IST

కస్తూర్బాగాంధీ బాలి కల విద్యాలయ భవన

‘కస్తూర్బా’ కష్టాలు
పిల్లర్లకే పరిమితమైన కస్తూర్బాగాంధీ విద్యాలయ భవన నిర్మాణం

  • కడ్తాలలో పిల్లర్ల ఏర్పాటుతోనే ఆగిపోయిన కస్తూర్బా గాంధీ విద్యాలయ భవన నిర్మాణం
  • అద్దె భవనంలో పాఠశాల
  • ఏడాదిన్నర కాలంగా పురోగతి లేని పనులు 
  • పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు 


కడ్తాల్‌ :  కస్తూర్బాగాంధీ బాలి కల విద్యాలయ భవన నిర్మాణ పనులు నత్తనడకన సాగుతు న్నాయి. ఏడాదిన్నర క్రితం పనులు ప్రారంభించినప్పటికీ ఇంకా పిల్లర్ల దశలోనే ఉంది. పనుల పూర్తి విష యంలో ఎవరూ చొరవ చూపడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం కస్తూర్బాగాంధీ విద్యాల యం కొనసాగుతున్న అద్దె భవ నంలో సదుపాయాలు లేక, సొంత భవనం పూర్తికాక ఇటు విద్యార్థులు, అటు ఉపాధ్యాయులు అవస్థలు పడు తున్నారు. సర్కార్‌ విద్యా వ్యవస్థ బలోపేతం, పేద విద్యా ర్థుల విద్యాభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నట్లు ప్రభుత్వం, పాలక ప్రజాప్రతినిధులు పేర్కొంటున్నా అందుకనుగుణంగా చర్యలు చేపట్టడం లేదు. భవన నిర్మా ణానికి మంజూరు చేసిన నిధులు సకాలంలో ప్రభుత్వం విడుదల చేయని కారణంగా పనులు నత్తనడకన సాగు తున్నట్లు సమాచారం. కడ్తాల మండల కేంద్రంలో 2017- 18లో ప్రభుత్వం కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సొంతభవనం లేని విద్యాలయాన్ని స్థానిక శ్రీశైలం-హైదారాబాద్‌ జాతీయరహదారి పక్కన అద్దె భవనంలో ప్రారంభించి కొనసాగిస్తున్నారు. విద్యాల యంలో 200మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. అసౌ కర్యాల అద్దెభవనంలో కొనసాగుతున్న కేజీబీవీకి సొంత భవనం నిర్మించాలని స్థానికులు, విద్యార్థినిల తల్లిదం డ్రులు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చారు. ఉన్నత స్థాయి ప్రజాప్రతినిధులు, అధికారులకు వినతి పత్రాలు అందజే శారు. దీంతో 2019 నవంబర్‌లో రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీ భవన నిర్మాణానికి రూ.3.35 కోట్లు మంజూరు చేసింది. దీంతో భవన నిర్మాణానికి కానుగు బావి తండాకు వెళ్లే రోడ్డులో రెండెకరాల ప్రభుత్వ స్థలాన్ని కేటాయించారు. 2020 మార్చి 12న భవన నిర్మాణానికి కల్వకుర్తి ఎమ్మెల్యే గుర్కా జైపాల్‌యాదవ్‌ శంకుస్థాపన చేశారు. మూడు నెలల తర్వాత కాంట్రాక్టర్‌ పనులు ప్రారంభించారు. బేస్‌మెంట్‌ లెవల్‌ వరకు పనులు పూర్తిచేసి పిల్లర్ల కోసం స్టీలు ఏర్పాటు చేసి వదిలేశారు. ఆ తర్వాత చేసిన పనులకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్‌ పనులు నిలిపివేసినట్లు సమాచారం. కాగా ఏడాదిన్నర క్రితం నిలిచిపోయిన పనులను ఇటీవల ప్రారంభించినా మళ్లీ ఆశించిన పురోగతి లేదు. ప్రస్తుతం కొనసాగుతున్న భవనం కూడా అద్దె కాల పరిమితి ముగియడంతో భవన యజమాని పాఠశాలను ఖాళీ చేయాలని అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. మరోచోట అనువైన అద్దెభవనం దొరకక, సొంత భవనం పూర్తికాక విద్యార్థినులు, ఉపాధ్యా యులు పడుతున్న బాధలు చెప్పలనవి కావు. సమస్య పరిష్కారానికి స్థానిక ప్రజాప్రతినిధులు చొరవ చూపడం లేదని పలువురు విమర్శిస్తున్నారు. ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను పూర్తిస్థాయిలో విడుదల చేయించి పనులను త్వరగా పూర్తిచేయించి ఇబ్బందులను తొలగిం చాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


ఇబ్బందులు పడుతున్నాం

కస్తూర్బా పాఠశాల కొన సాగుతున్న అద్దె భవ నంలో సరైన సౌకర్యాలు లేవు. దీంతో ఏళ్లకాలంగా ఇబ్బంది పడుతున్నాం. చదువులకు ఆటంకం కలు గుతుంది. సొంత భవన నిర్మాణం పనులు త్వరగా చేపట్టి విని యోగంలోకి తేవాలి. నిఽధుల విడుదల, భవన నిర్మాణానికి ప్రజాప్రతినిధులు, అధికారులు చొరవ తీసుకోవాలి.

- అంజలి, విద్యార్థి, పదో తరగతి 


అధికారులకు నివేదించాం

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ భవన నిర్మాణం పూర్తి గురించి అధికా రులు, ప్రజాప్రతినిధులకు విన్నవించాం. భవనం నిర్మించి వినియో గంలోకి తెస్తే విద్యార్థినుల ఇబ్బం దులు తీరుతాయి. ప్రస్తుతం విద్యాల యం కొనసాగుతున్న అద్దె భవనం కాల పరిమితి ముగి యడంతో భవన యజమాని ఖాళీ చేయమని ఒత్తిడి చేస్తున్నారు. స్థానికంగా అనువైన భవనాలు అద్దెకు లభిం చడం లేదు. సమస్యను పరిష్కరించాలని ఉన్నతాధికారు లకు, ప్రజాప్రతినిధులకు తెలియజేశాం.

- అనిత, ఎస్‌వో, కేజీబీవీ కడ్తాల్‌ 


భవన నిర్మాణం త్వరగా పూర్తయ్యేలా చూస్తాం

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయ భవన నిర్మాణం పనులు త్వరగ పూర్త య్యేలా చూస్తాం. ఏడాదిన్నర క్రితం నిలిచినపోయిన పనులను ప్రారంభిం చాలని ఇటీవల సంబంధిత కాంట్రా క్టర్‌పై ఒత్తిడి తెచ్చాం. దీంతో పనులు ప్రారంభించి కొనసాగిస్తున్నారు. వీలైనంత త్వరగా భవన నిర్మాణం పూర్తిచేసి వినియోగంలోకి తెస్తాం. అప్పటివరకు విద్యార్థినులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటాం. 

- జర్పుల దశరథ్‌ నాయక్‌, జడ్పీటీసీ, కడ్తాల్‌Updated Date - 2021-12-09T04:01:29+05:30 IST