కాంగ్రెస్‌ సభ్యత్వంతో ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతుంది

ABN , First Publish Date - 2021-12-10T05:09:42+05:30 IST

కాంగ్రెస్‌ సభ్యత్వంతో ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతుంది

కాంగ్రెస్‌ సభ్యత్వంతో ఆత్మవిశ్వాసం, గౌరవం పెరుగుతుంది
తాండూరులో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వాలు నమోదు చేయిస్తున్న కాంగ్రెస్‌ రాష్ట్ర పాధ్యక్షుడు ఎం.రమేష్‌

తాండూరు/ఘట్‌కేసర్‌ రూరల్‌/కులకచర : కాంగ్రెస్‌లో సభ్యత్వం తీసుకోవడం వల్ల ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం పెరుగుతుందని కాంగ్రెస్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.రమేష్‌ అన్నారు. ఆ పార్టీ తాండూరు పట్టణ అధ్యక్షుడు, కౌన్సిలర్‌ ప్రభాకర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్‌లో సభ్యులుగా చేరి సమాజ హితం కోసం పోరాడాలని అన్నారు. రాష్ట్రం ఇచ్చిన సోనియాగాంధీ జన్మదినం సందర్భంగా, 60ఏళ్ల స్వరాష్ట్రం, ఫలించిన దివ్యదినాన్ని పురస్కరించుకుని సభ్యత్వ నమోదుకు శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. టీపీసీసీ అధికార ప్రతినిధి కల్వ సుజాత మాట్లాడుతూ.. సోనియా వల్ల తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని, ప్రతి ఒక్కరూ సోనియాగాంధీకి అండగా నిలబడాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ మాజీ వైస్‌చైర్మన్‌ అలీం, మాజీ కౌన్సిలర్లు సర్దార్‌ఖాన్‌, మల్లన్న, జిల్లా కాంగ్రెస్‌ అధ్యక్షురాలు శోభారాణి తదితరులు పాల్గొన్నారు.  అదేవిధంగా సోనియాగాంధీ జయంతి వేడుకలను ఘట్‌కేసర్‌ మండలం ఘణాపూర్‌లో ఘనంగా జరుపుకున్నారు.  ఎన్టీపీసీ సంస్థ సమీపంలో కాంగ్రెస్‌ పార్టీ జెండాను అవిష్కరించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ బద్దం గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ సోనియాగాంధీ తెలంగాణ ఇచ్చిన మహానీయురాలని కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ బీ-బ్లాక్‌ అధ్యక్షుడు వేముల మహే్‌షగౌడ్‌, ఎంపీటీసీ గట్టగల్ల రవి, నాయకులు బర్ల అనిత, వేముల శోభ, రూప్‌సింగ్‌నాయక్‌, సురే్‌షనాయక్‌, సత్తయ్యగౌడ్‌, శంకర్‌గౌడ్‌, కట్ట జనార్దన్‌రెడ్డి, బొక్క సంజీవరెడ్డి, సుధాకర్‌రెడ్డి, మహేందర్‌, శ్రీను తదితరులు పాల్గొన్నారు. కులకచర్ల మండల పరిధిలో కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వాలను లక్ష్యం మేరకు పూర్తి చేస్తామని ఆ పార్టీ కులకచర్ల మండలాధ్యక్షుడు బీఎస్‌ ఆంజనేయులు తెలిపారు. సోనియాగాంధీ జన్మదిన ం సందర్భంగా గురువారం ముజాహిత్‌పూర్‌లో సభ్యత్వాలకు శ్రీకారం చుట్టారు. కాగా ప్రతి కార్యకర్తకూ డిజిటల్‌ ఐడీ కార్డు అందజేస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో నాయకులు యాదయ్య, అనంతయ్య, చంద్రభూపాల్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-10T05:09:42+05:30 IST