జీపీ భవనానికి శంకుస్థాపన
ABN , First Publish Date - 2021-12-16T05:09:35+05:30 IST
జీపీ భవనానికి శంకుస్థాపన

కొత్తూర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే గ్రామాలు అభివృద్ధి పథంలో నడుస్తున్నాయని షాద్‌నగర్ ఎమ్మెల్యే వై.అంజయ్యయాదవ్ అన్నారు. చంద్రాయన్‌గూడలో రూ.20లక్షలతో జీపీ, ఎస్‌డీఎఫ్ నిధులతో నిర్మించే డ్రైనేజీ కాలువలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు బుధవారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ గత ప్రభుత్వాలు భివృద్ధిని పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల్లో అభివృద్ధికి నిధులు మంజూరు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ జిల్లెల వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీలు కుమారస్వామిగౌడ్, కొమ్ము కృష్ణ, చంద్రపాల్‌రెడ్డి, విండో చైర్మన్ అశోక్, నాయకులు వి.నారాయణరెడ్డి, పద్మారెడ్డి, శ్రీనివా్‌సరెడ్డి, రాజునాయక్, కుమార్, రమేష్ పాల్గొన్నారు.