ఓర్వలేకనే ‘దళితబంధు’ పై ఈసీకి ఫిర్యాదు

ABN , First Publish Date - 2021-10-20T04:31:29+05:30 IST

ఓర్వలేకనే ‘దళితబంధు’ పై ఈసీకి ఫిర్యాదు

ఓర్వలేకనే ‘దళితబంధు’ పై ఈసీకి ఫిర్యాదు
కేంద్రప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేస్తున్న ఎమ్మెల్యే, తదితరులు

  • ఎమ్మెల్యే కాలె యాదయ్య 
  • చెవెళ్లలో టీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం

చేవెళ్ల : తెలంగాణలో దళితుల కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంచేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే కేంద్రప్రభుత్వం దళితబంధు పథకంపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. మంగళవారం చేవెళ్ల మండల కేంద్రంలో పార్టీ నాయకులతో కలిసి హైద్రాబాద్‌-బీజాపూర్‌ జాతీయ రహదారిపై కేంద్రప్రభుత్వం దిష్టిబొమ్మతో భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. దళితుల అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీజేపీ ప్రభుత్వం దళితబంధు పథకం అమలును ఆపాలని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిందన్నారు. హుజూరాబాద్‌ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ విజయం సాధిస్తుందన్నారు. సీఎం కేసీఆర్‌ అన్ని వర్గాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్నారని స్పష్టం చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు విజయలక్ష్మి, నక్షత్రం, జడ్పీటీసీ మాలతి, అవినా్‌షరెడ్డి, గోవిందమ్మ, ఆ పార్టీ మండల అధ్యక్షులు ప్రభాకర్‌, నర్సింగ్‌రావు, గోపాల్‌, మహేందర్‌రెడ్డి, మున్సిపాల్‌ చైర్మన్‌ విజయలక్ష్మి, సర్పంచ్‌ల సంఘం మండలాధ్యక్షుడు శివారెడ్డి, వైస్‌ఎంపీపీ కర్నె శివప్రసాద్‌, సర్పంచ్‌లు మాణిక్యరెడ్డి, జహంగీర్‌, ఎంపీటీసీ సత్యనారాయణచారి, సీనియర్‌ నాయకులు కృష్ణరెడ్డి, వెంకటేశ్‌, రాములు, రవీందర్‌, నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-20T04:31:29+05:30 IST