ఆపన్న హస్తంగా సీఎంఆర్‌ఎఫ్‌ : మంత్రి సబిత

ABN , First Publish Date - 2021-05-02T05:38:54+05:30 IST

ఆపన్న హస్తంగా సీఎంఆర్‌ఎఫ్‌ : మంత్రి సబిత

ఆపన్న హస్తంగా సీఎంఆర్‌ఎఫ్‌ : మంత్రి సబిత
కందుకూరు మండలం ఆకులమైలారం గ్రామానికి చెందిన లబ్ధిదారులకు సీఎంఆర్‌ఎఫ్‌ చెక్కు అందజేస్తున్న మంత్రి సబిత

కందుకూరు : సీఎంఆర్‌ఎఫ్‌ నిధులు నిరుపేదలకు ఆపన్న హస్తంగా మారుతున్నాయని మంత్రి సబితారెడ్డి అన్నారు. శనివారం ఆకులమైలారం గ్రామానికి చెందిన ఇద్దరు లబ్ధిదారులకు మండల సహకార సంఘం చైర్మన్‌ డి. చంద్రశేఖర్‌తో కలిసి ఆమె నివాసంలో చెక్కులు అందజేశారు. ఆకులమైలారం గ్రామానికి చెందిన మహేందర్‌కు రూ.43వేలు, కె.దాసుకు రూ.45వేల చెక్కులు అందించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కళమ్మరాజు, నాయకులు గుండు సురేష్‌, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-02T05:38:54+05:30 IST