బాలల రక్షణే ప్రభుత్వ లక్ష్యం
ABN , First Publish Date - 2022-01-01T04:58:30+05:30 IST
బాలల రక్షణే ప్రభుత్వ లక్ష్యం

బాలరక్షక్ వాహనాలను ప్రారంభించిన మంత్రి మల్లారెడ్డి
(ఆంధ్రజ్యోతి, మేడ్చల్ జిల్లా ప్రతినిధి/మేడ్చల్/ఘట్‌కేసర్): బాలల రక్షణ కోసం ప్రభుత్వం బాలరక్షక్ వాహనాలను అందుబాటులోకి తీసుకొచ్చిందని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. శుక్రవారం మంత్రి క్యాంపు కార్యాలయంలో బాలరక్షక్ వాహనాలను మల్లారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ప్రతీ జిల్లాకు ఒకటి చొప్పున ఈ వాహనాలను అందించనున్నట్లు తెలిపారు. అనాఽథ, బిక్షాటన చేసే పిల్లలను గుర్తించి ఈ వాహనంలో వారిని తీసుకొచ్చి రక్షణ కల్పిమన్నారు. ఇలాంటి పిల్లలు ఎవరైన ఉంటే 1098 హెల్ప్ లైన్ నెంబరు ఫోన్ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మర్రి రాజశేఖర్‌రెడ్డి, మహిళశిశు సంక్షేమ శాఖ అధికారులు పాల్గొన్నారు.
సీఎం రిలీఫ్‌ఫండ్ పేదలకు వరం
సీఎం రిలీ్‌ఫఫండ్ పేద ప్రజలకు వరమని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు. మేడ్చల్‌కు చెందిన నర్సింగ్‌రావు, వీరభద్రారెడ్డి అనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సీఎం రిలీఫ్‌ఫండ్ కోసం దరఖాస్తు చేసుకోగా మంజూరైన చెక్కులను మంత్రి లబ్ధ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎ్‌సకేవీ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్, విష్ణుచారి పాల్గొన్నారు. కాగా పోచారం మునిసిపాలిటీకి చెందిన శివకు రూ.50 వేలు, సయ్యద్ ఎక్బాల్‌కు రూ.25,500, రాజేశ్వరికి రూ.60వేలు, రాణిబాయికి రూ.60వేల సీఎం రిలీ్‌ఫఫండ్ చెక్కులను అందజేశారు.బోయపల్లి కొండల్‌రెడ్డి, రెడ్డానాయక్, మందాడి సురేందర్‌రెడ్డి, నల్లవెల్లి శేఖర్, నర్రి కాశయ్య, అక్రంఅలీ, రాఘవేందర్‌రెడ్డి పాల్గొన్నారు.