కసిరెడ్డికి మళ్లీ చాన్స్
ABN , First Publish Date - 2021-11-22T05:29:18+05:30 IST
కసిరెడ్డికి మళ్లీ చాన్స్

ఆమనగల్లు: శాసనమండలికి కసిరెడ్డికి మరోసారి అవకాశం లభించింది. కల్వకుర్తి నియోజకవర్గంలోని తలకొండపల్లి మండలం ఖానాపూర్ గ్రామానికి చెందిన కసిరెడ్డికి ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిత్వం ఖరారైంది. కాగా పార్టీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కేటీఆర్‌కు అత్యంత సన్నిహితుడైన నారాయణరెడ్డికి ఇప్పటికే అభ్యర్థిత్వంపై పార్టీ ద్వారా సమాచారం అందినట్లు తెలిసింది. ఈనెల 23న నామినేషన్ వేస్తారు.