వాస్తుపేరుతో తలుపు కూల్చివేతపై చైర్‌పర్సన్‌ ఆరా

ABN , First Publish Date - 2021-09-04T05:12:19+05:30 IST

వాస్తుపేరుతో తలుపు కూల్చివేతపై చైర్‌పర్సన్‌ ఆరా

వాస్తుపేరుతో తలుపు కూల్చివేతపై చైర్‌పర్సన్‌ ఆరా
డాకా విజయ ఇంటిని పరిశీలిస్తున్న మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌

వికారాబాద్‌: ‘వాస్తు పేరుతో తలుపు కూల్చిన అధికారులు’ అనే శీర్షికన ఆంధ్రజ్యోతి పత్రికలో వచ్చిన కథనానికి  వికారాబాద్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ మంజులరమేష్‌ స్పందించారు. శుక్రవారం మున్సిపల్‌ కమిషనర్‌ శరత్‌చంద్ర, స్థానిక కౌన్సిలర్‌ పావనిచంద్రశేఖర్‌రెడ్డిలతో కలిసి ఆలంపల్లిలో డాకా విజయ, కమలమ్మల ఇంటికి వెళ్లి జరిగిన విషయంపై ఆరాతీశారు. ఈసందర్భంగా ఇరు వర్గాలతో మాట్లాడి, ఈవిషయమై పూర్తి నివేదిక ఇవ్వాలని మున్సిపల్‌ అధికారులను ఆమె ఆదేశించారు.

Updated Date - 2021-09-04T05:12:19+05:30 IST