అవుషాపూర్‌లో పర్యటించిన కేంద్ర బృందం
ABN , First Publish Date - 2021-12-22T05:01:20+05:30 IST
అవుషాపూర్‌లో పర్యటించిన కేంద్ర బృందం
ఘట్‌కేసర్ రూరల్ : స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ 2021లో భాగంగా మంగళవారం మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలం అవుషాపూర్ గ్రామంలో కేంద్ర బృందం పర్యటించింది. కేంద్ర ప్రభుత్వ అధికారి శ్యాంబాబు ఆధ్వర్యంలో బృందం సభ్యులు గ్రామంలో పర్యటించి సర్పంచ్ కావేరి మశ్చందర్‌రెడ్డి ఆధ్వర్యంలో శానిటేషన్, శ్మశానవాటికలు, డంపింగ్‌యార్డు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలు, పరిశుభ్రతను పరిశీలించారు. మేడ్చల్ జిల్లా ఎంపీపీల ఫోరం అధ్యక్షుడు సుదర్శన్‌రెడ్డి సభ్యులకు గ్రామంలో చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలపై వివరించారు. కార్యక్రమంలో డీఎల్‌పీవో స్మిత, ఎండీవో అరుణరెడ్డి, సెక్రటరీ ఉమాదేవి తదితరులు పాల్గొన్నారు.