సీసీ కెమెరాలతో నేరాలకు చెక్‌

ABN , First Publish Date - 2021-01-13T05:36:32+05:30 IST

సీసీ కెమెరాలు వచ్చాక నేరాలు అదుపు లోకి వచ్చాయి.

సీసీ కెమెరాలతో నేరాలకు చెక్‌
బస్టాప్‌ సమీపంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరా

  • పోలీసుల చొరవతో గ్రామాల్లోనూ ఏర్పాటు
  • తగ్గుముఖం పడుతున్న నేరాలు
  • సామాన్యులకు సైతం అందుబాటు ధరలో సీసీ కెమెరాలు


నందిగామ: సీసీ కెమెరాలు వచ్చాక నేరాలు అదుపు లోకి వచ్చాయి. ఎవరైనా నేరాలు చేయడానికి జంకు తున్నారు. పట్టణాలు, గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పా టుకు పోలీసులు ప్రత్యేక చర్యలు తీసుకుంటు న్నారు. నేరాలు జరిగినప్పుడు వాటి ఆవశ్యకత గురించి ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఒక్క సీసీ కెమెరా 100మంది పోలీసులతో సమానమని ప్రజలకు వివరించి తమ నివాసాలు, వ్యాపార కేంద్రాలలో వాటిని ఏర్పాటు చేసుకో వాలని సూచిస్తున్నారు. దీంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రజలు ముందుకు వస్తున్నారు. ఇంతకు ముందు నందిగామ మండలంలో కొన్ని పరిశ్రమల్లో తప్ప ఎక్కడా సీసీ కెమెరాలు ఉండేవి కావు. కానీ నేడు పోలీ సుల చొరవతో చిన్నచిన్న కాలనీల్లో కూడా సీసీ కెమె రాలను ఏర్పాటు చేసుకుంటున్నారు. పోలీసులు కుల సంఘాలు, వ్యాపారులు, కాలనీ సంక్షేమసంఘాలు, దేవా లయాల కమిటీలు, ఆయా గ్రామాల సర్పంచులు, పాలక వర్గం సభ్యులు, గ్రామస్థులతో సమావేశాలు ఏర్పాటు చేసి సీసీ కెమెరాల ప్రాముఖ్యత గురించి తెలియజేసి వాటిని ఏర్పాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వ కార్యాల యాలు, బ్యాంకులు, పాఠశాలలు, వ్యాపార సంస్థలు, ఆసుపత్రులు, పరిశ్రమలు మొదలుకొని చిన్నచిన్న దుకా ణాల్లో సైతం సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇవి నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడతాయి. మండలంలోని ముఖ్య కూడల్లో దాతల సహకారంతో పోలీసులు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఇటీవల పలు కేసుల్లో నిందితులను సీసీ కెమెరాల ద్వారా గుర్తించినట్లు పోలీసులు తెలిపారు.


అందుబాటులో ధరలో సీసీ కెమెరాలు..

సీసీ కెమెరాల ధరలు సామాన్యునికి సైతం అందు బాటులో ఉండటంతో ప్రతిఒక్కరూ వీటిని ఏర్పాటు చేసు కునేందుకు ఆసక్తి చూపుతున్నారు. రూ.5 వేలు మొద లుకొని లక్షల రూపాయల వరకు వీటి ధరలు ఉన్నాయి. వీటిల్లో నాలుగు కెమెరాల సెటప్‌తోపాటు ఎనిమిది, పన్నెండు, పదహారు కెమెరాల సెటప్‌ బాక్సులు ఎక్కువగా అమ్ముడుపోతున్నాయి. అవసరాలను బట్టి 100జీబీ, 500జీబీ, 1000జీబీ, 2000జీబీ హార్డుడిస్కులు అందు బాటులో ఉన్నాయి. నాలుగు కెమెరాల సెటప్‌కు 500జీబీ హార్డ్‌డిస్క్‌ అమర్చుతే నెలరోజుల డాటా లభిస్తుంది. దీనికి రూ.15వేల నుంచి రూ.25 వేల వరకు ఖర్చు అవుతుంది.    


సీసీ కెమెరాలకు నేరస్థులు భయపడుతున్నారు

 సీసీ కెమెరాలు నేరాలను అరికట్టేందుకు ఎంతో దోహదపడుతున్నాయి. పెద్ద నేరాలు జరిగిన సమయంలో సంఘటనా స్థలంలో సీసీ కెమెరాలు లేకుంటే సమీపంలోని దుకాణాలు, నివాసాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించడం ద్వారా నేరస్థులను సులువుగా గుర్తించగలుగుతున్నాం. నేరాలకు పాల్పడే వారు సైతం సీసీ కెమరాలు ఉన్నాయా లేవా అని పరిశీలిస్తున్నారంటే వారిలో కూడా వీటి భయం ఎంతుందో అర్ధం అవుతోంది. సీసీ కెమెరాల ఆవశ్యకతను ప్రజలకు, వ్యాపారులకు, పరిశ్రమల యాజమాన్యాలకు వివరించడంతో మండలంలోని సుమారుగా అన్ని గ్రామాలతోపాటు దేవాలయాలు, పరిశ్రమల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు. మండలంలోని ముఖ్య కూడళ్లలో పోలీసింగ్‌ కింద సీసీ కెమరాలు ఏర్పాటు చేసి పోలీస్‌స్టేషన్‌లో మానిటరింగ్‌ చేస్తున్నాం. ప్రజలు, వ్యాపారులు సీసీ కెమెరాల ప్రాధ్యానత గుర్తించాలి. నేరాలు జరిగినప్పుడు ఇబ్బందులు పడేకంటే.. ముందే వాటిని ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది. 

- రామయ్య, ఇన్‌స్పెక్టర్‌, నందిగామ      Updated Date - 2021-01-13T05:36:32+05:30 IST