ఆర్టీసీ డ్రైవర్‌ను బెదిరించిన వ్యక్తులపై కేసు

ABN , First Publish Date - 2021-11-09T05:50:48+05:30 IST

ఆర్టీసీ డ్రైవర్‌ను బెదిరించిన వ్యక్తులపై కేసు

ఆర్టీసీ డ్రైవర్‌ను బెదిరించిన వ్యక్తులపై కేసు

షాద్‌నగర్‌ రూరల్‌: ఎమ్మెల్యే కారుకే సైడ్‌ ఇవ్వవా? అంటూ బస్సుకు కారును అడ్డుగా పెట్టి ఆర్టీసీ డ్రైవర్‌ను బెదిరించిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఇన్‌స్పెక్టర్‌ నవీన్‌కుమార్‌ సోమవారం తెలిపారు. 44వ నెంబర్‌ హైవేపై ఆదివారం వనపర్తి డిపో బస్సు హైదరాబాద్‌ నుంచి వనపర్తికి వె ళ్తుండగా సూర్యజ్యోతి జిన్నింగ్‌ మిల్లు సమీపంలో వెనుక నుంచి వచ్చిన ఎ మ్మెల్యే స్టిక్కర్‌ ఉన్న కారును బస్సుకు అడ్డంగా నిలిపి ఇద్దరు వ్యక్తులు డ్రైవర్‌పై దౌర్జన్యం చేశారన్నారు. ఎమ్మెల్యే కారుకే సైడ్‌ ఇవ్వవా? అంటూ బూతు లు తిడుతూ కర్రతో తనను బెదిరించారని బస్సు డ్రైవర్‌ వీఆర్‌రెడ్డి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు ఇన్‌స్పెక్టర్‌ తెలిపారు. ఇదిలా ఉం టే ఈ కేసు ఎఫ్‌ఐఆర్‌ కాపీని ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ తన ట్విటర్‌లో ఖాతాలో పెట్టి ‘చట్టం తన పని తాను చేస్తుంది.’ అని పేర్కొనడం గమనార్హం.

Updated Date - 2021-11-09T05:50:48+05:30 IST