139 మందికి కరోనా

ABN , First Publish Date - 2021-01-14T03:42:25+05:30 IST

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం 139 కరోనా కేసులు నమోదయ్యాయి.

139 మందికి కరోనా

(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో బుధవారం 139 కరోనా కేసులు నమోదయ్యాయి. రంగారెడ్డి జిల్లాలో 101 కేసులు నమోదు కాగా, వికారాబాద్‌ జిల్లాలో 6 కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 32 కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఉమ్మడిజిల్లాలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 1,17,688కి చేరుకుంది.


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌అర్బన్‌: షాద్‌నగర్‌ డివిజన్‌లో బుధవారం 132 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా నలుగురికి పాజిటివ్‌గా తేలింది. వారిలో కొందుర్గు మండ లానికి చెందిన ఒకరు, కొత్తూరులో ఒకరు, షాద్‌నగర్‌లో ఇద్దరు ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు.


వికారాబాద్‌ జిల్లాలో..

(ఆంధ్రజ్యోతి, వికారాబాద్‌)  : వికారాబాద్‌ జిల్లాలో బుధవారం కరోనా కేసులు తక్కువగానే నమోదయ్యాయి. తాండూరులో 4, పెద్దేముల్‌, యాలాల్‌లో ఒక్కో పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు జిల్లాలో 3,283 కరోనా కేసులు నమోదు కాగా, వాటిలో 157 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. ఇందులో ఐదుగురు వివిధ ఆసుపత్రుల్లో, 152మంది హోంకేర్‌లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఇంతవరకు జిల్లాలో కరోనా నుంచి 3,067మంది రికవరీ కాగా, 59మంది మృతి చెందారు. 

Updated Date - 2021-01-14T03:42:25+05:30 IST