కారు-బైక్‌ ఢీ.. వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2021-10-29T05:05:54+05:30 IST

కారు-బైక్‌ ఢీ.. వ్యక్తి మృతి

కారు-బైక్‌ ఢీ.. వ్యక్తి మృతి

వికారాబాద్‌: కారు, బైక్‌ ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన వికారాబాద్‌ పట్టణంలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. ఎన్నెపల్లికి చెందిన సయ్యద్‌గౌస్‌(28) మన్నెగూడ నుంచి వికారాబాద్‌ వస్తున్నాడు. ఈ క్రమంలో వికారాబాద్‌ నుంచి కలెక్టరేట్‌ వైపు ఆర్టీవో కార్యాలయం సమీపంలో వెళ్తున్న వికారాబాద్‌ జిల్లా ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ వరప్రసాద్‌ కారు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో సయ్యద్‌ గౌస్‌ కారు కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు  ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వికారాబాద్‌ మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.

పాముకాటుతో రైతు..

కులకచర్ల: మండలంలోని తిర్మలాపూర్‌ గ్రామంలో పాముకాటుతో రైతు మృతిచెందాడు. గ్రామానికి చెందిన కృష్ణయ్యగౌడ్‌(35) వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం సాయంత్రం తాను పెంచుతున్న మేకలను పొలానికి తీసుకెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యలో పాము కాటువేసింది. గమనించిన కుటుంబసభ్యులు అంబులెన్స్‌లో పరిగి ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్సపొందుతూ మృతిచెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు.  

Updated Date - 2021-10-29T05:05:54+05:30 IST