ప్రయాణికుల్లేక 30 విమానాల రద్దు
ABN , First Publish Date - 2021-05-08T05:37:03+05:30 IST
ప్రయాణికుల్లేక 30 విమానాల రద్దు

శంషాబాద్ రూరల్: వివిధ రాష్ట్రాల్లో కొవిడ్19 నిబంధనలు, ప్రయాణికుల్లేక శుక్రవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఢిల్లీ, పుణే, ముంబయి, గోవా, చెన్నై, బెంగళూర్ వెళ్లాల్సిన విమానాలను, ఆ ప్రాంతాల నుంచి శంషాబాద్‌కు వచ్చే 30విమాన సర్వీసులు తాత్కాలికంగా రద్దయ్యాయి. తెలంగాణ, ఏపీ రాష్ర్టాల నుంచి వచ్చే ప్రయాణికులు 14రోజుల క్వారంటైన్, ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో నెటిగివ్ రిపోర్టు, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకునే నిబందనలు తప్పనిసరి చేస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఢిల్లీ ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వాయిదా వేసుకున్నారు. ప్రయాణికుల్లేక పలు విమానయాన సంస్థలు తమ సర్వీసులను రద్దు చేశాయి. ఢిల్లీ, ఇతర రాష్ర్టాల్లో లాక్డౌన్ ఉండడంతో ప్రయాణికులు రావడం లేదు. కొవిడ్ లేని సమయంలో రోజూ శంషాబాద్ విమానాశ్రయం నుంచి 300 విమానాలు రాకపోకలు సాగించేవి. కొవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో రోజుకు 20 నుంచి 30 విమాన సర్వీసులు మాత్రమే కొనసాగిస్తున్నాయని ఎయిర్‌పోర్టు వర్గాలు వెల్లడించాయి.