కమ్మేసిన మంచు

ABN , First Publish Date - 2021-12-29T04:20:57+05:30 IST

కమ్మేసిన మంచు

కమ్మేసిన మంచు
కీసర రహదారిని కమ్మేసిన మంచు

 మేడ్చల్‌ జిల్లాలో  ఒక పక్క  చలి... మరో పక్క పొగమంచు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదు కావడంతో చలి తీవ్రతతో పాటు మూడు రోజులుగా దట్టమైన పొగమంచు ఏర్పడుతోంది. ఈక్రమంలో మంగళవారం కీసర, నాగారం, దమ్మాయిగూడ మున్సిపాటీల పరిధిల్లోని కాలనీలను దట్టమైన పొగమంచు కమ్మెసింది. దీంతో సమీపంలోని నివాసాలు, వాహనాలు కనిపించని పరిస్థితి ఏర్పడింది. ఎదురుగా వస్తున్న వాహనాలు కనిపించక  ప్రయాణికులు  లైట్లు వేసుకుని ప్రయాణాలు సాగించారు. ఉదయం 8గంటల అనంతరం మంచు తెరలను చీల్చుకుంటూ సూర్యుడు ఉదయించాడు.       - కీసర/ కీసర రూరల్‌ 

Updated Date - 2021-12-29T04:20:57+05:30 IST