వంతెన నిర్మాణ పనులు పునఃప్రారంభం

ABN , First Publish Date - 2021-12-26T05:16:55+05:30 IST

వంతెన నిర్మాణ పనులు పునఃప్రారంభం

వంతెన నిర్మాణ పనులు  పునఃప్రారంభం

ధారూరు: మండల పరిధిలోని దోర్నాల్‌-ధారూరు స్టేషన్‌ గ్రామాల మధ్య ఉన్న వాగుపై అసంపూర్తిగా ఉన్న వంతెన నిర్మాణ పనులు పునఃప్రారంభించారు.  వంతెన నిర్మాణం పూర్తికాకపోవటంతో  భారీ వర్షాలకు తాత్కలిక వంతెన తెగిపోయి ప్రాణనష్టంతో పాటు రాకపోకలు స్తంభించి మూడే ళ్లుగా ప్రజలు  తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బిల్లులు సకాలంలో విడుదల కాకపోవడంతో కాంట్రాక్టర్‌  పనులను  నిలిపివేశారు. కాగా, చేసిన పనులకు బిల్లులు మంజూరుకావడంతో తిరిగి పనులు ప్రారంభించారు.

Updated Date - 2021-12-26T05:16:55+05:30 IST