దివ్యసాకేతంలో ఘనంగా బ్రహ్మోత్సవాలు
ABN , First Publish Date - 2021-05-21T04:26:10+05:30 IST
మండలపరిధిలోని ముచ్చింతల్ శ్రీరామ నగరం దివ్యసాకేతంలో

- ప్రత్యేక పూజలు నిర్వహించిన చిన జీయర్‌స్వామి
శంషాబాద్‌రూరల్: మండలపరిధిలోని ముచ్చింతల్ శ్రీరామ నగరం దివ్యసాకేతంలో గురువారం ప్రముఖ ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి పర్య వేక్షణలో బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు ధ్వజారోహణం, అగ్ని ప్రతిష్ఠ, శేషవాహనంపై సాకే రామ చండ్రుడి ఊరేగింపు, దేవతా ఆహ్వానం వంటి ప్రత్యేక పూజలు చిన జీయర్‌స్వామి నిర్వహించారు. ఈ ఉత్సవాలు ఈ నెల 24 వరకు జరుగుతాయని నిర్వాహకులు తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు భక్తులెవరినీ అనుమ తించడం లేదని తెలిపారు. ఈ ఉత్సవాల్లో అహోబిల జీయర్‌స్వామి, దేవానాధ జీయర్‌స్వామి, వేదపండితులు తదితరులు పాల్గొన్నారు.