చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

ABN , First Publish Date - 2021-01-20T06:08:15+05:30 IST

చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

చికిత్స పొందుతూ ఇద్దరి మృతి

నవాబుపేట: చికిత్స పొందుతూ ఇద్దరు మృతిచెందిన సంఘటనలు నవాబుపేట, ఎద్దేముల్‌ మండలాల్లో చోటుచేసుకున్నాయి. మద్యం మత్తులో కిందపడిన ఓ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందిన సంఘటన మండల పరిధిలోని కడ్చర్ల గ్రామంలో చోటుచేసుకుంది. ఎస్‌ఐ వెంకటేషం తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఏసురత్నం గత 20రోజుల క్రితం రాంనాథ్‌గుడుపల్లి నుంచి కడ్చర్లకు వస్తుండగా గ్రామసమీపంలో ఓకల్వర్టు వద్ద ప్రమాదవశాత్తు కిందపడడంతో తలకు బలమైన గాయమైంది. గమనించిన గ్రామస్థులు కుటుంబసభ్యులకు తెలపగా ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతిచెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్‌ఐ తెలిపారు. మృతుడికి భార్య లక్ష్మి, ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతుడు గ్రామపంచాయతీలో వాటర్‌మెన్‌గా పనిచేసేవాడని వారు తెలిపారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరారు.


అనారోగ్యంతో పంచాయతీ కారోబార్‌..

పెద్దేముల్‌: అనారోగ్యంతో పంచాయతీ కారోబార్‌ మృతిచెందిన సంఘటన పెద్దేముల్‌ మండలం మంబాపూర్‌ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తెర్వటి నర్సిములు కొన్ని సంవత్సరాలుగా పంచాయతీ కారోబార్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వారం రోజుల క్రితం ఆయన అస్వస్థతకు గురికావడంతో హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం అర్ధరాత్రి మృతిచెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మంగళవారం సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఒక కుమారుడు ఉన్నారు.

Updated Date - 2021-01-20T06:08:15+05:30 IST