బొలెరో, టాటా ఏస్‌ ఢీ.. ఒకరి మృతి

ABN , First Publish Date - 2021-11-21T05:45:57+05:30 IST

బొలెరో, టాటా ఏస్‌ ఢీ.. ఒకరి మృతి

బొలెరో, టాటా ఏస్‌ ఢీ.. ఒకరి మృతి

  • మరో ఇద్దరికి తీవ్రగాయాలు


కొందుర్గు: ఎదురెదురుగా వస్తున్న రెండు వాహనాలు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతిచెందగా మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. ఈ ఘటన మండలంలోని శ్రీరాంగాపూర్‌ చౌరస్తా వద్ద శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై శ్రీను తెలిపిన వివరాల ప్రకారం.. ఫరూఖ్‌నగర్‌ మండల పరిధిలోని చటాన్‌పల్లి గ్రామానికి చెందిన వెంకటేష్‌(28) షాద్‌నగర్‌ నుంచి పరిగికి కోళ్లు తీసుకురావడానికి శనివారం రాత్రి 11గంటలకు టాటాఏస్‌ వాహనంలో బయలుదేరాడు. మార్గమధ్యలో కొందుర్గు మండలం శ్రీరంగాపూర్‌ వద్ద పరిగి నుంచి వస్తున్న బొలెరో వాహనం టాటాఏస్‌ను ఎదురుగా ఢీకొంది. ఈ ప్రమాదంలో వెంకటేష్‌ అక్కడికక్కడే మృతిచెందాడు. బొలెరో వాహనం డ్రైవర్‌ ఇమ్రాన్‌తో పాటు యజమాని ఫషియొద్దీన్‌, సలీం ఉన్నారు. డ్రైవర్‌ ఇమ్రామన్‌ టాటాఏస్‌ వాహనం ముందు భాగంలో ఇరుక్కున్నాడు. జేసీబీ సాయంతో అతడిని బయటకు తీసి చికిత్స నిమిత్తం షాద్‌నగర్‌కు తరలించారు. సలీంకు తీవ్రగాయాలయ్యాయి. మృతుడి భార్య నిర్మల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి ఇద్దరు కూతుర్లు ఉన్నారు.

Updated Date - 2021-11-21T05:45:57+05:30 IST