కిషన్‌రెడ్డిని కలిసిన బీజేపీ నాయకులు

ABN , First Publish Date - 2021-08-11T04:37:08+05:30 IST

కిషన్‌రెడ్డిని కలిసిన బీజేపీ నాయకులు

కిషన్‌రెడ్డిని కలిసిన బీజేపీ నాయకులు
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి వినతిపత్రం ఇస్తున్న బీజేపీ నాయకులు

కీసర రూరల్‌ : బీజేపీ మేడ్చల్‌ జిల్లా మాజీ అధ్యక్షుడు మాధవరం కాంతారావు, మాజీ ప్రధాన కార్యదర్శి కందాడి సత్తిరెడ్డిలు మంగళవారం కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం మేడ్చల్‌ జిల్లాలోని జవహర్‌నగర్‌ డంపింగ్‌యార్డును తొలగించాలని, కీసరగుట్టను పర్యాటకంగా అభివృద్ధి చేయాలని, ఘట్‌కేసర్‌ రైల్వేస్టేషన్‌లో అన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లు నిలిపేలా చర్యలు తీసుకోవాలని మంత్రికి వినతిపత్రాన్ని అందజేశారు. కాగా, సంబంధిత శాఖల మంత్రులతో చర్చించి చర్యలు తీసుకుంటామని మంత్రి తెలిపినట్లు కందాడి సత్తిరెడ్డి వెల్లడించారు. మంత్రిని కలిసిన వారిలో ఆర్కే శ్రీనివాస్‌, వెంకటరమణ, సందీ్‌పమిశ్రా, శ్రీనివాస్‌, తదితరులున్నారు.

Updated Date - 2021-08-11T04:37:08+05:30 IST