దేశ ఉనికిని చాటిన భగవద్గీత
ABN , First Publish Date - 2021-11-22T05:27:24+05:30 IST
దేశ ఉనికిని చాటిన భగవద్గీత

- విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ముడుపు యాదగిరిరెడ్డి
వికారాబాద్: ప్రపంచంలో భారతదేశ ఉనికికి చాటి చెప్పినది భగవద్గీత అని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి ముడుపు యాదగిరిరెడ్డి అన్నారు. డిసెంబర్ 14న తలపెట్టిన లక్ష దీపారాధనలో భాగంగా ఏర్పాటు చేసిన భగవద్గీత ప్రచార రథం ద్వారా ఆదివారం వికారాబాద్ వెంకటేశ్వర స్వామి ఆల యం నుంచి హనుమాన్ మందిరం వరకు ర్యాలీ నిర్వహించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతిమనిషి జీవితంలో ఎలా ఉండాలని నేర్పేది భగవద్గీత అన్నారు. గీతనేర్చుకో తలరాత మార్చుకో అని పిలుపునిచ్చారు. అదేవిధంగా ప్రధాని మోదీ ఏ దేశానికి వెళ్లినా వారికి భగవద్గీ బహూకరణ ఇవ్వడం జరుగుతోందని, ప్రపంచ దేశాలనుంచి భగవద్గీతకు అంత ఆదరణ లభిస్తోందని తెలిపారు. కార్యక్రమంలో వీహెచ్‌పీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు ప్రశాంత్‌కుమార్, మహిళా రాష్ట్ర నాయకురాలు శ్రీలత, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు.