తస్వర్‌అలీ బ్రదర్స్‌కు ‘ఉత్తమ సేల్స్’ అవార్డు
ABN , First Publish Date - 2021-10-22T05:00:42+05:30 IST
తస్వర్‌అలీ బ్రదర్స్‌కు ‘ఉత్తమ సేల్స్’ అవార్డు

వికారాబాద్, (ఆంధ్రజ్యోతి): సౌత్ ఇండియా జోన్ పరిధిలో సీసీఐ సిమెంట్ ఎక్కువ విక్రయాలు జరిపిన ఎండీ ఖాసీం అలీ అండ్ సన్స్, ఏషియన్ ఏజెన్సీ్సలకు ఉత్తమ సేల్స్ అవార్డు దక్కింది. 2020-21 సంవత్సరానికి సంబంధించి వికారాబాద్‌లోని ఎండీ ఖాసీం అలీ అండ్ సన్స్, ఏషియన్ ఏజెన్సీస్ సౌత్ ఇండియా జోన్ పరిధిలో తాండూరు సీసీఐ సిమెంట్ బస్తాలను ఎక్కువగా విక్రయాలు జరిపారు. ఈ సందర్భంగా బుధవారం రాత్రి బేగంపేట్ గ్రీన్‌ల్యాండ్స్‌లోని టూరిజం ప్లాజాలో సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎండీ ఖాసీంఅలీ అండ్ సన్స్, ఏషియన్ ఏజెన్సీస్ నిర్వాహకులు ఎండీ తస్వర్ అలీ, ఎండీ రియాజత్ అలీలకు సీసీఐ చైర్మన్ సంజయ్ బంగా, డైరెక్టర్ ఆర్పీ సింగ్, సౌత్ ఇండియా జోనల్ మేనేజర్ వైకే సింగ్ ఉత్తమ సేల్స్ అవార్డు అందజేసి ఘనంగా సన్మానించారు. సిమెంట్ విక్రయాల్లో మరోసారి అవార్డు దక్కడంతో తస్వర్‌అలీ, రియాజత్ అలీ సంతోషం వ్యక్తం చేశారు.