నిరుద్యోగ భృతి చెల్లించాలి

ABN , First Publish Date - 2021-08-11T05:11:41+05:30 IST

నిరుద్యోగ భృతి చెల్లించాలి

నిరుద్యోగ భృతి చెల్లించాలి
ఆమనగల్లులో చెప్పులు కుడుతూ నిరసన తెలుతున్న బీజేవైఎం నాయకులు

  • బీజేపీ, బీజీవైఎం ఆధ్వర్యంలో వినూత్న నిరసనలు

కేశంపేట/ఆమనగల్లు/మంచాల/చేవెళ్ల/కందుకూరు: నిరుద్యోగ భృతి చెల్లించాలని, ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయాలంటూ బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం వివిధ మండలాల్లో బీజేపీ, బీజేవైఎం నాయకులు వివిధ రూపాల్లో నిరసన వ్యక్తం చేశారు. కేశంపేటలోని వివేకానందస్వామి విగ్రహం వద్ద చెప్పులు తుడిచి నిరసన వ్యక్తం చేశారు. 33 నెలల నిరుద్యోగ భృతి చెల్లించాలని, 2లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు నరసింహయాదవ్‌, కిసాన్‌ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాస్‌, బీజేవైఎం జిల్లా కార్యవర్గ సభ్యుడు శివాజీ పాల్గొన్నారు. ఆమనగల్లులో బీజేవైఎం పట్టణ అఽ ధ్యక్షుడు రాజుగౌడ్‌ ఆధ్వర్యంలో చెప్పులు కుట్టి నిరసన తెలిపారు. బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు కండె సాయి, బీజేపీ నాయకుడు భగవాన్‌రెడ్డి, సందీప్‌, రాఘవ్‌, రాజు, అంజి, నిఖిల్‌, మహేశ్‌, శివ, యాదగిరి పాల్గొన్నారు. మంచాలలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జి.లచ్చిరెడ్డి నేతృత్వంలో బూట్‌ పాలిష్‌ చేసి, రోడ్లు ఊడు స్తూ, టీ అమ్ముతూ నిరసన తెలిపారు. కేసీఆర్‌ మాటలతో గారడీతో నిరుద్యోగులను మోసం చేస్తున్నారని ఆరోపించారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు రాజు, వైస్‌ ఎంపీపీ బాషయ్య, జంగయ్య, నూకం రాజు, రాజేందర్‌రెడ్డి, రమేష్‌, డి.విజయ్‌, జి.వినోద్‌, చంద్రశేఖర్‌, ప్ర భాకర్‌రెడ్డి, యాదగిరి, సాయిగౌడ్‌, గిరిగౌడ్‌ పాల్గొన్నారు. చేవెళ్లలో మండలాధ్యక్షుడు పత్తి సత్యనారాయణ ఆధ్వర్యంలో బూట్‌ పాలిష్‌ చేశారు. ఉపాధ్యక్షుడు అభిలాష్‌, రాజు, అశోక్‌, ప్రకాశ్‌, శ్రీనివాస్‌, మధుకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌, సందీ్‌పగౌడ్‌, భాస్కర్‌, శ్రీనివాస్‌, శివ పాల్గొన్నారు. కందుకూరులో బీజేవైఎం మండల అధ్యక్షుడు లింగం, యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు భానుప్రకాశ్‌ ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. నాయకులు అంజిరెడ్డి, శ్రీనివాస్‌, మధుకర్‌, సాయిబాబ, ఎం.నవీన్‌, రవి, శివ, ఆంజనేయులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-11T05:11:41+05:30 IST