సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి
ABN , First Publish Date - 2021-08-26T04:24:35+05:30 IST
సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి

శంకర్‌పల్లి : సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలని శంకర్‌పల్లి సీఐ మహే్‌షగౌడ్ పేర్కొన్నారు. మంగళవారం రాత్రి చందిప్ప గ్రామంలో సైబర్ నేరాలు, రోడ్డు ప్రమాదాలపై గ్రామస్థులకు అవగాహన కల్పించారు. సీఐ మాట్లాడుతూ.. గ్రామాల్లో చాలా మంది గుర్తుతెలియని వ్యక్తుల చేతుల్లో మోసపోతున్నారని, అపరిచితుల నుంచి వచ్చే ఫోన్‌కాల్స్‌కి సమాధానం ఇవ్వకూడదని, ఎవరికైనా అనుమానం కలిగితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ద్విచక్ర వాహనదారులు లైసెన్స్, హెల్మెట్ తప్పక కలిగి ఉండాలన్నారు. కార్యక్రమంలో ఎస్‌ఐ సంజీవ, ఎంపీటీసీ దయాకర్‌రెడ్డి, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.