వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

ABN , First Publish Date - 2021-08-28T05:06:00+05:30 IST

వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి

వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండాలి
మాట్లాడుతున్న ఎంపీపీ పద్మజగన్‌

మేడ్చల్‌ రూరల్‌: వర్షాకాలంలో వ్యాధులు ప్రబలకుండా అధికారులు అప్రమత్తంగా ఉంటూ గ్రామాల్లో తగిన చర్యలు చేపట్టాలని ఎంపీపీ పద్మజగన్‌రెడ్డి ఆదేశించారు. వర్షాకాలంలో ప్రబలే వ్యాధులపై శుక్రవారం ఎంపీపీ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ.. రోగాలు ప్రబలకుండా అవసరమైన  చర్యలు తీసుకోవాలని, ఇంటి పరిసరాలతో పాటు వీధులు పరిశుభ్రంగా ఉండేవిధంగా చూడాలన్నారు. డెంగ్యూ, మలేరియా తదితర రోగాలు ప్రబలుతున్నందున వైద్యులు తగిన చర్యలు చేపట్టాలన్నారు. రోడ్లపై మురుగు నీరు ఉండకుండా డ్రైనేజీలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించాలన్నారు. సమావేశంలో ఎండీవో శశిరేఖ, మేడ్చల్‌ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ దీపికానర్సింహారెడ్డి, కమిషనర్‌ సత్యనారాయణరెడ్డి, అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ అధికారులు కీర్తన, సూపర్‌వైజర్‌ మల్లీశ్వరి పాల్గొన్నారు. 

Updated Date - 2021-08-28T05:06:00+05:30 IST