డిండి రైతులకు వడ్డీతో సహా పరిహారం చెల్లించాలి
ABN , First Publish Date - 2021-01-13T05:05:52+05:30 IST
డిండి రైతులకు వడ్డీతో సహా పరిహారం చెల్లించాలి

జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి
మాడ్గుల : మాడ్గుల మండలంలోని డిండి కాల్వ కింద భూము లు కోల్పోయిన రైతులకు ప్రభుత్వం చెల్లించాల్సిన నష్టపరిహారాన్ని బ్యాంకు వడ్డీతో సహా ఈనెల 19కల్లా చెల్లించాలని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు ఆచారి ఆదేశించారు. మాడ్గుల మండలం బ్రాహ్మణపల్లిలో మంగళవారం డిండి కాల్వకింద భూములు కోల్పోయిన రైతులతో ఏర్పాటైన సమావేశంలో ఆచారి పాల్గొని మాట్లాడారు. రైతులకు పరిహారం చెల్లించాకే పనులు చేపట్టాలని అన్నారు. న్యాయం చేయకపోతే క్రిమినల్ కేసు నమోదు చేయకటానికి ఆదేశాలు జారీ చేయటానికి వెనుకాడబోమని అన్నారు. రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు పూర్తి సమాచారంతో కమిషన్‌కు నివేదిక పంపాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఇరిగేషన్ ఈఈ గోవింద్, డీఈఈ క్రాంతి, ఏఈఈ దేవేందర్, సుశీల, బీజేపీ మండల అధ్యక్షడు పెద్దయ్య యాదవ్, బీజేపీ నాయకులు అందుగుల శ్రీను, దండు శ్రీను, కమలేశ్వర్ పాల్గొన్నారు.
రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారు
ఆమనగల్లు : రక్తదాతలు ప్రాణదాతలుగా నిలుస్తారని జాతీయ బీసీ కమిషన్ సభ్యుడు తల్లోజు ఆచారి అన్నారు. ఆమనగల్లు పట్టణంలో మంగళవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆమనగల్లు సీఐ జాల ఉపేందర్, ఎస్‌ఐ ధర్మేశ్, మున్సిపల్ చైర్మన్ రాంపాల్‌నాయక్, వైస్ చైర్మన్ దుర్గయ్య, ఏబీవీపీ పట్టణ కార్యదర్శి లండం మల్లేశ్, కౌన్సిలర్లు, నాయకులు చెక్కాల లక్ష్మణ్, శ్రీకాంత్ సింగ్, బైకని శ్రీశైలం యాదవ్, కృష్ణయాదవ్, విజయ్‌కృష్ణ, చెన్నకేశవులు, సుండూరు శేఖర్, దోనాదుల మహేశ్, భగీరథ్, జల్ల్లెల్ల శివ, వరికుప్పల శ్రీనివాస్, ఎర్రవోలు మహేశ్, పాతకోట శ్రీశైలం, సాయి, శివ, సురేశ్, వంశీ, మధు పాల్గొన్నారు.