ముగిసిన బతుకమ్మ సంబురాలు
ABN , First Publish Date - 2021-10-17T04:46:33+05:30 IST
ముగిసిన బతుకమ్మ సంబురాలు
తాండూరు రూరల్: మండలంలోని ఆయా గ్రామాల్లో వారం రోజులపాటు కొనసాగిన బతుకమ్మ వేడుకలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా సంగెంకలాన్‌లో ఎంపీపీ ఎస్.అనితారవీందర్‌గౌడ్ ఆధ్వర్యంలో బతుకమ్మలను వాగులో నిమజ్జనం చేశారు. కరన్‌కోట్‌లో సర్పంచ్ వీణా, ఉపసర్పంచ్ హేమంత్‌కుమార్ ఆధ్వర్యంలో, చెంగోల్ గ్రామంలో సర్పంచ్ మల్లీశ్వరి ఆధ్వర్యంలో, అదేవిధంగా అమెరికాలోని న్యూజెర్సీలో తాండూరు ఆడపడుచులు బతుకమ్మ సంబురాల్లో పాల్గొని ఆడిపాడారు.